అనూప్ రూబెన్స్ లోని సంగీత దర్శకుడు అంత చిన్న వయ్సులోనే పుట్టడట.!

Tuesday, June 30th, 2020, 03:30:41 PM IST

ప్రస్తుతం లాక్ డౌన్ లో పలు సడలింపు చేసిన అనంతరం మన తెలుగు టెలివిజన్ ఛానెల్స్ తిరిగి మళ్లీ షూటింగ్స్ ప్రారంభించారు. అలా చేసిన వాటిలో ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే షోలు కూడా ఉన్నాయి. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ఈటీవీ ఎంటర్టైనింగ్ షోలలో టాలీవుడ్ కమెడియన్ ఆలీ వ్యాఖ్యాతగా చేసే ఆలీతో సరదాగా షో కూడా ఒకటి.

ఈ షోకు ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబన్స్ గెస్ట్ గా వచ్చారు. అయితే తాను అసలు సంగీత దర్శకునిగా ఎలా మారాల్సి వచ్చిందో ఈ షో ద్వారా తెలిపారు. తన తండ్రికి ఉన్న అప్పులు మూలంగా తాను ఊహించని విధంగా సినిమాల్లోకి రావాల్సి వచ్చిందని..

కానీ తనలో సంగీత దర్శకుడు తన చిన్నతనంలోనే బయటికొచ్చాడని అనూప్ రూబెన్స్ చెప్పాడు. తాను నాలుగో తరగతి చదువుతున్న సమయంలోనే తన ఇంట్లో స్పూన్స్ మరియు పాత్రలతో మోత మోగించే వాడినని అలా అప్పుడే తనలో సంగీత దర్శకుడు బయటకు వచ్చాడని అనూప్ తెలిపాడు.