సైరా కి మరొక దెబ్బ – ఏమైంది…?

Tuesday, September 17th, 2019, 02:25:11 AM IST

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం సైరా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రాన్నీ భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. మొట్టమొదటి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి కనిపించనున్నారు. కాగా షూటింగ్ పూర్తీ చేసుకున్న చిత్రం ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ చిత్రాన్ని గాంధీ జయంతి రోజున, అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకు తీసుకరాడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి ముందు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకని చాలా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకుంటున్నారు. ఈ సందర్భంగా సైరా బృందానికి పెద్ద షాక్ తగిలిందని చెప్పాలి.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశీయులు తమకు న్యాయం చేయాలనీ పోరాటం చేస్తున్నారు. ఈమేరకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి కార్యాలయం ముందు సైరా వంశీయులు ఆందోళనకి దిగారు. కాగా ఈ చిత్రానికి సంబంధించి అవసరమైన లొకేషన్లు, నరసింహారెడ్డి గారి పూర్తీ జీవితచరిత్ర ని తెలుసుకున్నారని, కానీ వారికి అవసరమైనవి అంత తెలుసుకొని ఆతరువాత తమకు న్యాయం చేస్తామని చిరంజీవి మాటిచ్చారని, కానీ ఇపుడు తమకు అన్యాయం చేశారని వారు వాపోతున్నారు. కానీ ఇలాంటి సందర్భాల్లో ఈ చిత్ర బృందం వారికి ఎలా సమాధానం చెబుతుందో చూడాలి మరి.