మరో బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన దుల్కర్ సల్మాన్ ?

Tuesday, January 23rd, 2018, 12:37:10 PM IST

మలయాళ, తమిళ, తెలుగు భాషల్లో నటుడిగా ఇమేజ్ తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ కు మరో క్రేజీ అవకాశం దక్కింది. తాజాగా ఆయనకు బాలీవుడ్ ఆఫర్స్ రావడంతో ఎగిరి గంతేశాడట. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా పరిచయం అయినా దుల్కర్ హీరోగా తనదైన గుర్తింపు తక్కువ సమయంలోనే తెచ్చుకున్నాడు. తాజాగా అయన బాలీవుడ్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పాడట. ఓ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందట, హీరోయిన్ గా సోనమ్ కపూర్ నటిస్తుందట. ఇప్పటికే బాలీవుడ్ లో కార్వాన్ అనే సినిమాలో నటిస్తున్న దుల్కర్ కు ఇలా వరుసగా బాలీవుడ్ ఆఫర్స్ రావడం విశేషం. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తెలుగులో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మహానటి లో జెమినీ గణేశన్ పాత్రలో నటిస్తున్నాడు.