కత్తి మహేశ్‌కి మరో షాక్.. నాంపల్లి పీఎస్‌లో కేసు నమోదు..!

Monday, February 10th, 2020, 07:49:13 PM IST

సినీ క్రిటిక్ కత్తి మహేశ్‌కి మరో షాక్ తగిలింది. ఇటీవల రాముడిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కారణం చేత ఇప్పటికే ఆయనపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఒక ఇంటర్వ్యూలో రామాయణం అనేది నాకొక కథ అంటూ రాముడనేవాడు ఎంత ఆదర్శవంతుడో అంత దగుల్బాజీ అని నేను నమ్ముతానని అన్నాడు. ఆ కథలో సీత బహుశా రావణుడితోనే ఉంటే బాగుండేదేమో, న్యాయం జరిగి ఉండేదేమో అని నేననుకుంటా అని అనడంతో ఆగ్రహించిన హిందూ జనశక్తి నేతలు రాముడిని దుర్భాషలాడారంటూ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

అయితే తాజాగా ఇదే విషయంపై నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో కూడా కత్తి మహేశ్‌పై కేసు నమోదు అయ్యింది. న్యాయవాది కరుణసాగర్‌ అనే వ్యక్తి రాముడిపై కత్తి మహేశ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన కత్తి మహేశ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.