సుశాంత్ సింగ్ కేసులో బయటకొస్తున్న మరిన్ని నిజాలు.!

Sunday, August 2nd, 2020, 05:50:47 PM IST

బాలీవుడ్ లో పెద్ద మిస్టరీగా మారిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యా ఘటన పై విచారణ అలా ఇంకా కొనసాగుతూనే ఉంది. మొదట ఆత్మహత్యగా చిత్రీకరించబడ్డ ఈ విషాద ఘటన ఇప్పుడు హత్య అనే దానికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రబర్తి పై చాలా అనుమానాలు అందరికీ ఉన్నాయి.

ఇప్పుడు వాటికి తగ్గట్టుగానే మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయి. సుశాంత్ విషయంలో బయటకొచ్చిన చాలా నిజాలో అతను చనిపోక ముందు చాలా సిమ్స్ మార్చాడని వినిపించిన కారణం కూడా ఒకటి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి మరిన్ని కీలక నిజాలు వస్తున్నట్టు తెలుస్తుంది.

సుశాంత్ సిమ్స్ మార్చిన మాట నిజమే కానీ ఆ సిమ్స్ అతని పేరిట తీసుకోలేదని విచారణలో తేలింది. సుశాంత్ స్నేహితుడు సిద్దార్థ్ పేరిట ఒక సిమ్ తీసుకున్నారని ఆ కాల్ రికార్డ్స్ ను ఇప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారని తెలుస్తుంది. మరి ఈ ఘటన ఎక్కడ ఆగుతుందో చూడాలి.