మ‌రో మ‌ల్లూ భామ టైమ్ స్టార్ట‌యిన‌ట్టే!

Friday, November 11th, 2016, 06:38:29 PM IST

Manjima-Mohan
మ‌ల్లూవుడ్ నుంచి టాలీవుడ్‌పై దండెత్తుతున్న ముద్దుగుమ్మ‌ల హ‌వా సాగుతోందిప్పుడు. తెలుగువారి సొమ్ముల్ని అబ‌గా ఎగ‌రేసుకుపోవ‌డ‌మే గాక మంచి పేరు కూడా తెచ్చుకుంటున్నారు. అదే కోవ‌లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, న‌మిత ప్ర‌మోద్‌, కీర్తి సురేష్ లాంటి భామ‌లు పెద్ద స‌క్సెస‌య్యారు. ఈ భామ‌ల వ‌రుస‌లోనే మాంజిమ పేరు వ‌చ్చి చేరిందిప్పుడు. చైత‌న్య స‌ర‌స‌న న‌టించిన‌ సాహ‌సం శ్వాస‌గా సాగిపో ఈరోజు రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి మాంజిమ పెద్ద ప్ల‌స్ అయ్యింద‌న్న టాక్ వినిపించింది. బొద్దుగుమ్మే అయినా ముద్దుగా క‌నిపించింది. క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్‌తో ఆక‌ట్టుకుంది. మ‌ల్లూ బ్యూటీకి తెలుగులో మంచి భ‌విష్య‌త్ ఉంద‌న్న టాక్ వినిపించింది.

ఏదైతేనేం ఎవ‌రి ఫేట్ అయినా స‌క్సెస్‌ని బ‌ట్టి మారుతుంది. సాహ‌సం హిట్ట‌యితే త‌న‌కి నాలుగైదు అవ‌కాశాలు వ‌స్తాయి. తేడాలొస్తే ఆ ప్ర‌భావం కెరీర్‌పై ప‌డుతుంది. అయితే జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా ఈ భామ‌ను మ‌రిన్ని ఛాన్సులు వెతుక్కుంటూ వ‌చ్చేంత పెర్ఫామెన్స్ మాత్రం చేసింది మ‌రి!