వైరల్ అవుతున్న “RRR” ఫ్యాన్ మేడ్ పోస్టర్..!

Monday, July 13th, 2020, 06:20:23 PM IST

ఇప్పుడు మన దేశంలో మోస్ట్ అవైటెడ్ మరియు బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లలో ఒకటి దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న “రౌద్రం రణం రుధిరం”. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ హైప్ ఉంది.

ఈలోగా ఈ చిత్రానికి సంబంధించి ఇద్దరు హీరోల అభిమానులు తమ ప్రేమను ప్రతిభను కలగలిపి కొన్ని అద్భుతమైన ఫొటోస్ ద్వారా చూపిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లూరిగా నటిస్తున్న రామ్ చరణ్ పై అలాగే కొమరం భీమ్ లా యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కనిపించనున్నారు. వీరి రోల్స్ కు సంబంధించి అనేక ఫ్యాన్ మేడ్ ఎడిట్ లు చేశారు.

అవి సోషల్ మీడియాలో మంచి వైరల్ అయ్యాయి. అలా ఇప్పుడు మళ్లీ మరో ఫ్యాన్ మేడ్ పోస్టర్ వైరల్ అవుతుంది. రాజమౌళితో కలిసి ఉన్న సీతారామ రాజు మరియు కొమరం భీమ్ లను పట్టుకుని ఉన్న కార్టూన్ ఫ్యాన్ మేడ్ పిక్ వైరల్ అవుతుంది.దీనితో ఈ పిక్ చూసిన వారంతా సోషల్ మీడియాలో తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.