వాల్మీకి కి షాక్ – సినిమా ఆపేయాలని కలెక్టర్ల ఆదేశాలు…

Thursday, September 19th, 2019, 09:00:03 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం వాల్మీకి. హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా, పూజ హెగ్డే కథానాయికగా నటించింది. కాగా ఈ చిత్రం శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయినప్పటినుండే ఎన్నో వివాదాలు ఈ చిత్రం చుట్టుముట్టాయి… ఈ చిత్ర టైటిల్ మార్చాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఎన్ని వివాదాలు వచ్చినప్పటికీ కూడా ఎట్టిపరిస్థితుల్లోను ఈ చిత్ర విడుదలని ఆపబోయేది లేదని, ఇప్పటికే ఈచిత్ర దర్శక నిర్మాతలు తెగేసి చెప్పారు.

అయితే ఈ చిత్రంలో సన్నివేశాలు ఎవరిని కించపరిచేలా లేవని, ఈ చిత్రం వలన ఎవరికీ ఎలాంటి సమస్యలు రావని చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పటికే పలుమార్లు తెలిపారు. కాగా వాల్మీకి చిత్రం ఇంకొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకి రాబోతుందని అనగా ఈ చిత్రానికి పెద్ద షాక్ తగిలిందని చెప్పాలి. కర్నూల్, అనంతపురం జిల్లాల్లో సినిమా విడుదలను ఆపేయాలి అని థియేటర్ యాజమాన్యానికి కలెక్టర్లు పలు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఏమవుతుందో చూడాలి మరి…