రాజమౌళి #RRR కథ అదేనంటూ మరో వార్త చక్కర్లు.!

Friday, October 12th, 2018, 07:05:02 PM IST

రాజమౌళి బాహుబలి లాంటి భారీ హిట్ తర్వాత కొంత కాలం విశ్రాంతి తీసుకున్నా రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో ఒక మల్టీస్టారర్ అంటూ ఇంకో సంచలనాన్ని సృష్టించాడు.దీనితో తెలుగు చిత్ర పరిశ్రమ అంతా మళ్ళీ రాజమౌళి వైపు ఒక్కసారిగా ఉలిక్కి పది చూసింది.ఇప్పుడు రాజమౌళి మార్కెట్ ప్రపంచ స్థాయిలో ఉంది దానికి తోడు టాలీవుడ్ లోని ఇద్దరు బడా హీరోలు ఆ ఇద్దరు బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అన్న రేంజ్ లో భీబత్సం సృష్టిస్తారు.అలాంటి వారితో సినిమా అని ప్రకటించేసి ప్రస్తుతం రాజమౌళి ప్రశాంతంగా ఉన్నారు.

తారక్ ఇప్పుడెలాగో అరవింద సమేత విడుదలతో ఖాళి అయ్యాడు,ఇక మిగిలి ఉంది చరణ్ ఒక్కడే బోయపాటి తో తీస్తున్న చిత్రం కూడా ముగిసి పోతే ఇక వీరు రాజమౌళి #RRR చిత్రాన్ని పట్టాలెక్కించేస్తారు.ఐతే ఈ చిత్రం యొక్క కథ అలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటూ పలు వార్తలు హల్ చల్ చేశాయి.తారక్ మరియు చెర్రీలు అన్న తమ్ములని ఒకటి,ఇద్దరు కిక్ బాక్సర్ల మధ్య సాగే కథ అని పలు రకాల పుకార్లు వచ్చాయి అయితే ఇప్పుడు తాజాగా మరో కథ బయటకి వచ్చింది.తారక్ మరియు చెర్రీలు ఈ చిత్రంలో ఒకరు దొంగ ఒకరు పోలీస్ గా కనిపిస్తారని,రాజమౌళి ఆధ్యంతం ఆసక్తిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని వార్తలొస్తున్నాయి.ఈ వార్తయిన నిజమో కాదో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు మనం ఆగాల్సిందే.