ప్రమోషన్స్ లో వెనుకబడ్డ ‘అంతరిక్షం’ !

Wednesday, December 5th, 2018, 06:00:02 PM IST

‘ఫిదా, తొలిప్రేమ’ చిత్రాల రూపంలో వరుస విజయాలను అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ ఈ సారి డిఫ్రెంట్ జోనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎమ్ పిహెచ్’. ఈ చిత్రం విడుదలకు కేవలం ఇంకా 15 రోజుల సమయం మాత్రమే వున్నా ప్రమోషన్స్ మాత్రం అనుకున్నంత స్థాయిలో జరుగడం లేదు. ఇక ఈ చిత్రం తో పాటే విడుదలకానున్న ‘పడి పడి లేచె మనసు’ ప్రమోషన్స్ విషయంలో దూసుకుపోతుంది. అయితే అంతరిక్షం లాంటి సినిమా ఇంతవరకు తెలుగులో రాకపోవడం అలాగే ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రామిసింగ్ గా ఉండడంతో ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక దానికి తోడు ప్రమోషన్స్ కూడా తోడైతే ఈచిత్రం మంచి వసూళ్లను రాబట్టుకోవడం ఖాయం. మరి ఇప్పటికైనా చిత్ర టీం ప్రమోషన్స్ వేగవంతం చేస్తారో లేదో చూడాలి.

స్పెస్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో లావణ్య త్రిపాఠి , అదితి రావ్ హైదరి కథానాయికలుగా నటించారు. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం డిసెంబర్ 21న విడుదలకానుంది.