నా లైఫ్‌లో నేను చేసిన.. పెద్ద త‌ప్పు అదే.. అను సంచ‌ల‌నం..!

Monday, October 29th, 2018, 04:50:18 PM IST

టాలీవుడ్ బాక్సాఫీస్‌ వ‌ద్ద గీతా గోవిందం చిత్రం ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. 5 కోట్ల‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం.. దాదాపు వంద కోట్ల‌కు పైగానే క‌లెక్ట్ చేసి ట్రేడ్ వ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర్చింది. ఈ చిత్ర విజ‌యం విజ‌య్ దేవ‌రకొండ ఖాతాలో మ‌రో సెన్షేష‌న్ హిట్ వ‌చ్చి చేర‌గా.. హీరోయిన్ ర‌ష్మిక మందాన ఫేట్‌ను రాత్రికి రాత్రే మార్చేసింది గీత‌గోవిందం. ఈ చిత్రంలో ర‌ష్మిక – విజ‌య్‌ని ఆడుకున్న తీరు యూత్‌కి బాగా క‌నెక్ట్ అయ్యింది. దీంతో ఈ చిత్రంలో ర‌ష్మిక న‌ట‌న‌కు ఫిదా అయిపోయారు ప్రేక్ష‌కుల‌. దీంతో టాలీవుడ్‌లో ర‌ష్మిక పేరు ఒక్క‌సారిగా మారుమోగిపోతుంది.

అయితే ఇక్క‌డ అసలు మ్యాట‌ర్ ఏంటంటే.. ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప‌ర‌సురాం ఫ‌స్ట్ ఛాయిస్ రష్మిక కాద‌ట‌.. గీత‌గోవిందం కోసం ముందుగా అను ఇమ్మాన్యూల్‌ను అనుకున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే ఈ హాట్ బ్యూటీని చిత్ర యూనిట్ సంప్ర‌దించ‌గా డేట్స్ ఖాలీగా లేవ‌ని రిజెక్ట్ చేసింద‌ట‌. అయితే గీతా గోవిందం ఆఫ‌ర్ వ‌చ్చిన‌ప్పుడు నా పేరు సూర్య చిత్రంలో న‌టిస్తున్నాన‌ని.. దీంతో గీత గోవిందంకు డేట్లు అడ్జ‌స్ట్ చేయ‌లేక పోయాయ‌ని అను చెప్పింది. తీరా క‌ట్ చేస్తే గీతా గోవిందం సంచ‌ల‌న విజ‌యం సాధించింది. దీంతో ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెగ బాధ ప‌డిపోతుంది. నా లైఫ్‌లో నేను చేసిన పెద్ద త‌ప్పు గీత గోవిందం ఆఫ‌ర్‌ను వ‌దులుకోవ‌డ‌మే అని తెగ ఫీలైపోతుంది అను. మ‌రి వ‌చ్చిన అవ‌కాశాన్ని వ‌దులుకొని ఇప్పుడు బాధ‌ప‌డి ఏం లాభ‌మ‌ని సినీ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments