అనుప‌మా భవిష్య‌త్తు.. తేల్చ‌నున్న.. హ‌లో గురు ప్రేమ‌కోస‌మే..?

Wednesday, October 17th, 2018, 04:36:14 PM IST

అ..ఆ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కేర‌ల కుట్టీ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ స్టార్టింగ్‌లో న‌టించిన చిత్రాలు వ‌రుసాగా విజ‌యం సాధించాయి. అయితే ఇటీవ‌ల ఈ ముద్దుగుమ్మ న‌టించిన చిత్రాల‌న్నీ ప్లాప్ అవ‌డంతో అను కెరీర్ డేంజ‌ర్ జోన్‌లో ప‌డింది. తొలుత అ..ఆ చిత్రంలో నాగ‌వ‌ల్లిగా న‌టించిన అనుప‌మ తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్ష‌కుల మ‌ధిలో చెర‌గ‌ని ముద్ర వేసింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన మ‌ళ‌యాలం రీమేక్ ప్రేమ‌మ్ చిత్రంలో న‌టించిన అనుప‌మను చూసిన కుర్ర‌కారు గుండెల్లో గూడు క‌ట్టుకున్నారు. ఇక ఆ త‌ర్వాత వ‌చ్చిన శ‌త‌మానం భ‌వ‌తి చిత్రం సూప‌ర్ హిట్ కావ‌డంతో అను రేంజ్ అమాంతం పెరిగిపోయింది.

ఇక అప్ప‌టి వ‌ర‌కు టాప్ గేర్‌లో దూసుకుపోతున్న అనుప‌మ కెరీర్ ఒక్క‌సారిగా బ్రేక్ ప‌డింది. ఉన్న‌ది జింద‌గీ ఒక్క‌టే అనుప‌మ న‌ట‌న‌కు మంచి పేరు వ‌చ్చినా.. ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద స‌క్సెస్ కాక‌పోవ‌డంతో అను విజ‌యాల‌కు బ్రేక్ ప‌డింది. ఇక ఆ త‌ర్వాత వ‌చ్చిన కృష్ణార్జునయుద్ధం, తేజ్ ఐ ల‌వ్ యూ చిత్రాలు భారీగా డిజాస్ట‌ర్‌లు అవ‌డంతో అనుప‌మ కెరీర్ పై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. ఈ నేప‌ధ్యంలో మ‌రోసారి త‌న‌కు సూప‌ర్ హిట్ ఇచ్చిన దిల్ రాజు నిర్మాణంలో వ‌స్తున్న హ‌లో గురు ప్రేమ‌కోస‌మే చిత్రంలో మ‌రోసారి రామ్‌తో జోడీ కట్టింది అనుప‌మ‌. దీంతో ఈ చిత్రం పై ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది అను. ఒక‌వేల ఈ చిత్రం సక్సెస్ కాకపోతే టాలీవుడ్‌లో అనుప‌మ కెరీర్‌కి పుల్‌స్టాప్ ప‌డిపోవ‌డం ఖాయ‌మ‌ని సినీ విశ్లేష‌కులు సైతం అభిప్రాయ ప‌డుతున్నారు. దీంతో విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా అక్టోబ‌ర్ 18న విడుద‌ల కానున్న ఈ చిత్ర రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఏది ఏమైనా టాలీవుడ్‌లో అనుప‌మ భ‌విష్య‌త్తు హ‌లో గురు ప్రేమ‌కోస‌మే చిత్రంతో తేలిపోనుంద‌ని సినీ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments