అనుపమ గ్లామర్ దెబ్బకు .. 10 లక్షల వ్యూస్ ?

Wednesday, September 19th, 2018, 10:19:53 AM IST

రామ్ హీరోగా త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న హలొ గురు ప్రేమకోసమే సినిమా టీజర్ నిన్న విడుదలై పెద్ద దుమారం రేపుతోంది. ఈ టీజర్ విడుదలైన కేవలం 6 గంటల్లోనే 10 లక్షల వ్యూస్ తో సంచలనం రేపుతోంది. అయితే ఈ వ్యూస్ కి అసలు కారణం ఎవరో తెలిసా అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమాలో గ్లామర్ ని అలా ఒలకబోసిందుకే ఈ రేంజ్ లో వ్యూస్ వస్తున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజమే .. అనుపమ ను గ్లామర్ యాంగిల్ లో ప్రజెంట్ చేసి షాకిచ్చేలా చేసారు.

ఈ మధ్య ఈ అమ్మడికి సరైన సక్సెస్ లు మాత్రం దక్కడం లేదు .. దాంతో కాస్త గ్లామర్ కు సై అన్నట్టుంది అందుకే .. ఇలా గ్లామర్ యాంగిల్ ప్రదర్శించారు. అనుపమ గ్లామర్ దెబ్బకు ఈ రేంజ్ లో వ్యూస్ రావడంతో సినిమా పై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రాన్ని వచ్చే నెల 18న విడుదల చేయనున్నారు .. మరి ఈ సినిమాలో అనుపమ అందాలు ఏ రేంజ్ లో కనువిందు చేస్తాయో అని షాక్ అవుతున్నారు జనాలు.