అనుష్క‌కి అంత కోపం ఎందుకొచ్చిన‌ట్టు?

Sunday, September 25th, 2016, 02:38:40 PM IST

anushka45
పెదాల‌పై చిరున‌వ్వుని చెరిగిపోనివ్వ‌ని ఓ క‌థానాయిక అనుష్క‌. మంచి జ‌రిగినా, చెడు జ‌రిగినా ఎప్పుడూ ఒక‌లాగే ఉంటుందామె. కోపంతో క‌నిపించ‌డం ఎప్పుడూ ఎవ్వ‌రూ చూసుండ‌రు. ఆమెపైనా బోలెడ‌న్ని గాసిప్పులొచ్చాయి. చెప్పాలంటే మిగిలిన క‌థానాయిక‌ల‌కంటే ఎక్కువ గాసిప్పులు అనుష్క‌మీదే వ‌చ్చుంటాయి. అయినా స‌రే, ఎప్పుడూ బాధ‌ప‌డింది లేదు. వాళ్ల ప‌ని వాళ్ల‌దే, మ‌న పని మ‌న‌దే అన్న‌ట్టు గాసిప్పురాయుళ్ల‌ని చూసీ చూడ‌న‌ట్టు వ‌దిలేసేది. అయితే రీసెంట్‌మాత్రం ఆమె తెగ బాధ‌ప‌డిపోతోంద‌ట‌. లోలోప‌ల కోపం కూడా ప్ర‌ద‌ర్శిస్తోంద‌ట‌. అందుకు కార‌ణం ఆమె పెళ్లిపై వ‌స్తున్న పుకార్లే. అనుష్క త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతోంద‌ని, ప‌రిశ్ర‌మ‌కి చెందిన ఓ వ్య‌క్తితో ఆమె ప్రేమాయ‌ణం సాగిస్తోంద‌ని వ‌చ్చిన పుకార్ల‌పైనే అనుష్క అస‌హ‌నానికి గుర‌వుతోంద‌ని స‌మాచారం. “ఇంకెన్నిసార్లు నా పెళ్లి గురించి రాస్తారు? ఇంకెంత‌మందితో ప్రేమాయ‌ణం అంటూ ప్ర‌చారం చేస్తారు? ప‌నితోనే తీరిక లేకుండా గ‌డిచిపోతోంది. ఇప్పుడు పెళ్లి గొడ‌వెందుకు?“ అని ఆమె త‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర వాపోతోంద‌ట‌. అనుష్క అభిప్రాయ‌మేంటో కానీ… వాళ్ల పేరెంట్స్ మాత్రం `బాహుబ‌లి 2` విడుద‌ల కాగానే పెళ్లి చేసేయాల్సిందే అని నిర్ణ‌యించుకొన్నార‌ట‌.