అనుష్క ఫ్యాన్స్ మొత్తానికి భారీ ట్రెండ్ సెట్ చేశారు గా!

Tuesday, July 21st, 2020, 09:18:10 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుశ్క సినీ పరిశ్రమ లోకి అడుగు పెట్టి 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. అయితే ఈ నేపధ్యంలో అనుశ్క శెట్టి అభిమానులు సోషల్ మీడియా ద్వారా భారీగా విషెస్ తెలిపారు. ఇప్పటి వరకూ ఒక అభిమాన హీరో కి సోషల్ మీడియా లో ట్రెండింగ్ మనం చూశాం. అయితే మొదటి సారిగా ఒక హీరోయిన్ కి ట్రెండ్ సెట్ చేశారు అభిమానులు.

#anushkashetty అంటూ ఒక్క రోజులోనే అభిమానులు 136.3k ట్వీట్స్ చేశారు. అంతేకాక #15yrsofanushkashettyreign హ్యష్ ట్యాగ్ పేరుతో మరో 157.7k ట్వీట్స్ సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే మొత్తం 259k ట్వీట్స్ తో సోషల్ మీడియా లో ట్రెండ్ అవ్వడం ఇదే తొలిసారి. ఒక హీరోయిన్ పేరిట ట్రెండ్ కావడం పట్ల అనుష్క నిజంగానే లేడీ సూపర్ స్టార్ అంటూ కితాబిస్తున్నారు. అనుష్క ఒక మామూలు హీరోయిన్ గా కెరీర్ మొదలు పెత్తి, అనంతరం సూపర్ స్టార్ గా ఎదగడం పట్ల అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనుష్క నటించిన నిశబ్దం చిత్రం విడుదల అవ్వాల్సి ఉండగా, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా, లాక్ డౌన్ అమలు తో వాయిదా పడింది.