అనుష్క పై కమెడియన్ సంచలన వ్యాఖ్యలు ?

Tuesday, October 9th, 2018, 07:54:22 PM IST

అనుష్క తెలుగు తెరపై అటు గ్లామర్ హీరోయిన్ గా ఇటు లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో సత్తా చాటిన నటి. అరుంధతి, భాగమతి, బాహుబలి లాంటి సినిమాల్లో తనదైన నటనతో బాక్స్ ఆఫీస్ వద్ద దుమారం రేపిన అనుష్క బాగమతి తరువాత ఏ సినిమాలో కనిపించడం లేదు. ప్రస్తుతం ఆమె సైజ్ జీరో సినిమా సమయంలో బాగా బరువు పెరగడంతో ఇప్పుడు ఆ బరువు తగ్గి స్లిమ్ అయ్యే పనిలో ఉంది. ఇప్పటికే పలు అవకాశాలు వస్తున్నా కూడా అనుష్క నో చెబుతూనే ఉంది. అయితే తాజాగా అనుష్క పై ప్రముఖ తెలుగు కమెడియన్ సంచలన వ్యాఖ్యలు చేసాడు .. అయితే అవి పాజిటివ్ గానే లెండి .. నెగిటివ్ గా కాదు. ఇంతకీ ఎవరా కమెడియన్ ఏమా కథ అంటే .. కామెడియాన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ శ్రీను. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఈయన స్పందిస్తూ .. మంచితనం అనగానే నాకు అనుష్క గుర్తొస్తుందని చెప్పారు. అనుష్క ఎంత స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఆమె ఆ రేంజ్ ని చూపించదని, అతనికంటే తక్కువ రేంజ్ ఉన్న వాళ్లతో కూడా కలుపుగోలుగా మాట్లాడుతుందని చెప్పాడు. బాగమతి సినిమా షూటింగ్ లో ఓ హాస్టల్ బిల్డింగ్ లో రాత్రి షూటింగ్ చేసినప్పుడు తెల్లవారితే పిల్లలు దసరా సెలవులకు ఊరికి వెళతారని తెలుసుకుని , చాకోలెట్స్ , బిస్కట్స్ లు పంచింది అని చెప్పారు. ఆమె మంచితనం చూసి ఆశ్చర్యపోయాను అని చెప్పాడు . అది విషయం !!