హీరోయిన్ అనుష్క శర్మపై హెచ్ఆర్సీలో కేసు.. కారణం అదే..!

Sunday, May 24th, 2020, 02:13:12 AM IST

బాలీవుడ్ బ్యూటీ, భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణీ అనుష్క శర్మపై హెచ్ఆర్సీలో కేసు నమోదు అయ్యింది. అనుష్క శర్మ నిర్మాతగా నిర్మించిన ‘పాతాళ్ లోక్’ వెబ్ సిరీస్‌లో గూర్ఖా వాళ్లను అవమానించారంటూ ది ఆల్ అరుణాచల్ ప్రదేశ్ గూర్ఖా యూత్ అసోసియేషన్’ సభ్యులు కేంద్రానికి సంబంధించిన హెచార్సీలో ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసారు.

అయితే వీరికి మద్ధతుగా మరికొన్ని గూర్ఖా సమాజానికి చెందిన మరికొన్ని సంఘాలు మద్ధతు తెలుపుతుండడంతో ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించి జాతీయ స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. పాతాళ్ లోక్ వెబ్ సిరీస్‌కు సంబంధించి‌ రెండో ఎపిసోడ్‌లో ఓ సీన్ గూర్ఖా సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నట్టు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు ఈ సీన్‌లో వచ్చే మాటలను వినబడకుండా మ్యూట్ చేయాలంటూ గూర్ఖా సమాజాపు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఈ వెబ్ సిరీస్ నిర్మించిన అనుష్క శర్మ పై న్యాయ పోరాటం చేస్తామన్నారు.