అనుష్క కొత్త సినిమా – అలాంటి పాత్రలో నటించనుందా…?

Saturday, January 12th, 2019, 05:45:37 PM IST

ఎన్నో సినిమాల్లో తనదైన నటనని కనబర్చిన అనుష్క గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. బాహుబలి శకం ముగిసిన తరువాత దాదాపు ఎలాంటి సినిమాని అనౌన్స్ చేయలేదు అనుష్కా… ఎన్నో అవకాశాలు వస్తున్నప్పటికీ కూడా అనుష్క ఇంతవరకు ఏ సినిమాకు సంతకం చేయలేదు. దానికి కారణం ఏంటో తెలియదు కానీ ప్రస్తుతానికి అనుష్క లేడి ఓరియెంట్ సినిమాలకి మొగ్గు చూపుతుందని సమాచారం. దాదాపు ఇన్ని రోజుల గ్యాప్ తరువాత ఎట్టకేలకు అనుష్క ఒక సినిమాలో నటించబోతుందని సమాచారం…

కోన వెంకట్ నిర్మాణంలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఓ థ్రిల్లింగ్ సినిమా ప్లాన్ చేశారు. అనుష్క ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం… ఈ చిత్రానికి సంబందించి పక్కా స్క్రిప్ట్ వర్క్ కూడా సిద్ధం అయిపోయిందట. ఇందులో అనుష్క ఓ ఒక దివ్యంగురాలి పాత్రలో కనిపిస్తుందని సమాచారం. హాలీవుడ్ స్టార్ నటుడు మైఖేల్ మాడ్సన్ విలన్ పాత్రలో కనిపిస్తున్నాడట. ఎక్కువభాగం షూటింగ్ అమెరికాలో ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుందని సమాచారం.