స్వీటీ అనుష్క పెళ్లి కుదిరెను?!

Monday, October 29th, 2018, 09:50:35 AM IST

స్వీటీ అనుష్క శెట్టి పెళ్లెప్పుడు? .. నిరంత‌రం ఇదో హాట్‌ టాపిక్. ఓవైపు ఫ్యాన్స్.. మ‌రోవైపు మీడియా ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్న విష‌య‌మిది. గ‌త కొంత‌కాలంగా దీపిక ప‌దుకొనే, ప్రియాంక చోప్రా పెళ్లి గురించి ఎంత హ‌డావుడి జ‌రిగిందో అంత‌కు రెట్టింపు హ‌డావుడి అనుష్క పెళ్లి విష‌యంలో జ‌రుగుతోంది. ఆ ఇద్ద‌రి కంటే అనుష్క పెళ్లిపైనే ఇటీవ‌ల బాలీవుడ్ మీడియా సైతం కాన్‌స‌న్‌ట్రేట్ చేస్తోంది. నిరంత‌రం ప్ర‌భాస్‌తో అనుష్క ఎఫైర్ వార్త‌ల‌తో వేడెక్కిస్తూనే, ఆ ఇద్ద‌రూ తొంద‌ర్లోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ర‌క‌ర‌కాల వార్త‌ల్ని ప్ర‌చారం చేసింది ఉత్త‌రాది మీడియా.

అయితే ప్ర‌తి సంద‌ర్భంలో ఆ ప్ర‌చారాన్ని కొట్టి పారేస్తూనే ఉన్నారు.గ‌త కొంత‌కాలంగా స్వీటీ సినిమాల‌కు దూరంగా ఉండ‌డంతో అభిమానుల్లోనూ అనుమానం బ‌ల‌ప‌డింది. స్వీటీ ఇక పెళ్లి చేసుకునేందుకే ఈ గ్యాప్ తీసుకుంది అంటూ ఒక‌టే ముచ్చ‌టా సాగుతోంది. ఆ క్ర‌మంలోనే గ‌త కొంత‌కాలం క్రితం అనుష్క బ‌రువు త‌గ్గేందుకు నేచుర‌ల్ విధానంలో ప్ర‌య‌త్నిస్తోందని, అందుకోసం నార్వేలోని ఓ స్పెష‌లిస్ట్ స్పా ట్రీట్‌మెంట్ కోసం వెళ్లింద‌ని ప్ర‌చార‌మైంది.

తాజాగా స్వీటీ ఇన్‌స్టాగ్ర‌మ్‌లో ఓ ఆస‌క్తిక‌ర ఫోటోని షేర్ చేసి మ‌రోసారి డౌట్ రెయిజ్ చేసింది. దానికి ఓ ఆస‌క్తిక‌ర‌ క్యాప్ష‌న్‌ని ఉంచింది. ఆ ఫోటోలో త‌న కాలి వేలికి ఓ అంద‌మైన ప‌చ్చ‌ని తీగ అల్లుకుని ఉంది. ఆ తీగ‌కు డిజైన‌ర్ రింగ్ త‌ర‌హాలో ఆకులు క‌నిపించాయి. కాలి వేలికి చుట్టు ఉంగ‌రం పెట్టుకోవ‌డం అన్న‌ది భార‌తీయ సాంప్ర‌దాయంలో పెళ్ల‌యిన మ‌గువ‌కు సింబాలిక్. స్వీటీ పోస్ట్ చేసిన ఫోటో చూడ‌గానే అలాంటి సందేహమే క‌లుగుతోంది. `క్యాప్ష‌న్ అక్క‌ర్లేదు` అంటూ ఆ ఫోటోకి ల‌వ్‌ ఈమోజీని జోడించింది అనుష్క‌. మొత్తానికి స్వీటికి బ్యాండు బాజాకి వేళాయిందా? .. ల‌గ్గ‌మెట్టే వేళ‌య్యిందా? మూడుముళ్ల‌కు ముహూర్తం ఫిక్స‌యిందా? అంటూ ఒక‌టే అభిమానులు తెగ ఇదైపోతున్నారు. అయితే దీనికి అనుష్క‌నే స్వ‌యంగా స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. `భాగ‌మ‌తి` త‌ర్వాత ఎందుకు మ‌రో సినిమాకి సంత‌కం చేయ‌లేదో కూడా త‌నే వివ‌ర‌ణ ఇవ్వాల్సి ఉంటుంది.

  •  
  •  
  •  
  •  

Comments