అదిపురుష్ చిత్రానికి ఆస్కార్ గ్రహీత సంగీతం!

Sunday, September 13th, 2020, 06:00:14 PM IST

ప్రభాస్ వరుస సినిమాలు అనౌన్స్ చేసి ప్రేక్షకులను సంతోషం లో ముంచేశారు. ఎన్నడూ లేని విధంగా మూడు సినిమాలు ఇప్పుడు లైన్ లో ఉన్నాయి. రాధే శ్యామ్ , సుజిత్ దర్శకత్వం లో మరొక సైన్స్ ఫిక్షన్ సినిమా, ఇప్పుడు ఈ ఆదిపురుష్. అయితే ఈ చిత్రం లో ప్రభాస్ రోల్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దశాబ్దాల క్రితం నాటి కథ తో ఓం రౌత్ ఈ కథను తెరకెక్కించేందుకు సిద్ధం కాగా, రాముడు గా ప్రభాస్, రావణాసురుడు గా సైఫ్ అలీఖాన్ లు కన్ఫర్మ్ అయ్యారు.

అయితే ఈ చిత్రానికి సంబంధించిన మరొక ఆసక్తికర అంశం ఇప్పుడు చర్చంశనీయం అయింది. లెజెండరీ సంగీత దర్శకుడు, సింగర్ ఏ ఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో తెరకక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇటువంటి చిత్రానికి సంగీతం ఏ ఆర్ రెహమాన్ లాంటి వాళ్ళు అయితే సినిమా ఇంకో రేంజ్ లో ఉండే అవకాశం ఉందని చిత్ర యూనిట్ భావిస్తుంది. అయితే ఇంకా సంప్రదింపు జరిపే ఆలోచనలో ఉండగా, ఇంకా ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.