రెహ‌మాన్ బ‌యోపిక్‌లో మ్యూజిక్ సీక్రెట్స్‌!?

Wednesday, September 26th, 2018, 11:09:49 PM IST

స్వ‌రమాంత్రికుడు ఏ.ఆర్‌.రెహ‌మాన్ పై డాక్యు సిరీస్ తెర‌కెక్క‌నుంది. ప్ర‌ఖ్యాత అమెజాన్ ప్రైమ్ ఆ మేర‌కు ఈ డాక్యు- సిరీస్ తీసేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ డాక్యు సిరీస్‌ని ఐదు భాగాలుగా తెర‌కెక్కించ‌నున్నారని తెలుస్తోంది. అంటే ఐదు సీజ‌న్‌లుగా ఈ సిరీస్ అమెజాన్‌లో లైవ్ కానుంద‌న్న‌మాట‌. ఇది నిజంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న కోటాను కోట్ల ఏ.ఆర్.రెహ‌మాన్ అభిమానుల‌కు శుభ‌వార్త‌లాంటిదే.

వాస్త‌వానికి గ‌త రెండు నెల‌లుగా దీనిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతున్నా.. ఇన్నాళ్లు స‌రైన క‌న్ఫ‌ర్మేష‌న్ లేదు. ఇక రెహ‌మాన్ జీవితాన్ని ప‌లు కోణాల్లో ఈ డాక్యు సిరీస్ స్ప‌ర్శించ‌నుంది. ఇందులో మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ స‌హా స్వ‌ర‌సాధ‌న‌, వోక‌ల్స్ త‌దిత‌రాల గురించి డీటెయిలింగ్ ఇస్తార‌ని తెలిసింది. అయితే ప్ర‌తిదీ రెహ‌మాన్ కోణంలో ఈ విశ్లేష‌ణ సాగుతుంది. స‌న్నీలియోన్ `క‌ర‌ణ్‌జీత్` త‌ర‌హాలో య‌థార్థ సంఘ‌ట‌న‌ల‌కు య‌థావిధిగానే తెర‌కెక్కిస్తారు. ఇక‌పోతే యోగా గురూ రామ్ దేవ్ బాబాపైనా ఈ త‌ర‌హా డాక్యు సిరీస్ తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. రెహ‌మాన్ బ‌యోపిక్ న‌వ‌త‌రం సంగీత‌జ్ఞుల‌కు ఓ గైడ్‌లా ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి.