“కౌశల్ ఆర్మీ”కు థాంక్స్ చెప్పుకున్న “అరవింద సమేత” బ్యూటీ..!

Thursday, October 11th, 2018, 09:38:30 AM IST

కౌశల్ కు ఇప్పుడున్న క్రేజ్ విషయం కానీ, అతని కోసమే ఉన్న కౌశల్ ఆర్మీ కోసం కానీ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు.అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్,పూజ హెగ్డేలు నటించి భారీ అంచనాల నడుమ ఈ రోజు విడుదలైన చిత్రం “అరవింద సమేత వీర రాఘవ”. ఈ చిత్రం ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ సంతరించుకోవడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.అయితే ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తూ చిత్ర హీరోయిన్ యొక్క నటన పట్ల ట్విట్టర్ లో కౌశల్ ఆర్మీ అభినందనలు తెలియజేసారు.

ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రోజు విడుదలైనటువంటి అరవింద సమేత వీర రాఘవ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది దీనితో ట్విట్టర్లో కౌశల్ ఆర్మీ పూజ హెగ్డేని మరియు చిత్ర యూనిట్ ను ప్రశంసల్లో ముంచెత్తారు.తారక్ నటన అద్భుతం అని పూజ హెగ్డే ఈ చిత్రంలో చాలా ప్రముఖ పాత్ర పోషించారని,అంతే కాకుండా పూజ చాలా క్యూట్ గా ఉన్నారని ప్రసంసలు కురిపించగా దానికి గాను పూజ హెగ్డే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కౌశల్ ఆర్మీకి రిప్లై గా తన సంతోశాన్ని వ్యక్తపరిచారు.పూజ హెగ్డే నుంచి రిప్లై రావడంతో కౌశల్ ఆర్మీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.