“అరవింద సమేత” భారీ హిట్ నుంచి నష్టాల దిశ వైపు..?

Thursday, October 25th, 2018, 07:58:08 PM IST

దసరా కానుకగా ఈ నెల ప్రేక్షకుల ముందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు పూజా హెగ్డేలు నటించిన “అరవింద సమేత వీర రాఘవ” చిత్రం విడుదలయ్యింది.అయితే ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి మంచి మౌత్ టాక్ రావడంతో ప్రారంభం లోనే భారీ కలెక్షన్లను నమోదు చేసింది.అంతా బాగానే ఉన్నా సరే ఇప్పుడు ఈ చిత్రానికి వతున్న కలెక్షన్ విషయం లో మాత్రం ఒక గందరగోళ వాతావరణం నెలకొంది.అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం ఉందని,ముందు కలెక్షన్లు కూడా భారీ గానే వస్తున్నాయని వార్తలు కూడా వచ్చాయి.

అయితే ఈ చిత్రానికి వస్తున్న కలెక్షన్ ఫేక్ అంటూ వారి అభిమానులకు ఇతర హీరో అభిమానులకు సోషల్ మీడియాలో యుద్ధం నడుస్తుంది.ప్రారంభంలో బాగానే ఉన్నా సరే ఈ చిత్రానికి సంబందించిన వసూళ్లు రోజు రోజుకి కాస్త నెమ్మదించాయనీ,ఓవర్సీస్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది అని, ప్రీ రిలీజ్ బిజినెస్ లో చేసినంత అన్ని చోట్లా లాభాలను ఈ చిత్రం తెచ్చి పెట్టేలా లేదని రకరకాల వార్తలొస్తున్నాయి..మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాలంటే ఈ చిత్రం ఫుల్ రన్ వరకు ఆగాల్సిందే.

  •  
  •  
  •  
  •  

Comments