బ్రేకింగ్ అండ్ షాకింగ్.. అరవింద సమేత వివాదం.. పెద్ద ఘోర‌మే జ‌రిగిపోయింది..!

Wednesday, October 17th, 2018, 12:52:04 PM IST

అరవింద సమేత వీర‌రాఘ‌వ చిత్ర వివాదం తాజాగా ఒక‌రిని బ‌లితీసుకోగా.. మ‌రో ముగ్గురు తీవ్ర‌గాయాల‌పాలు అయ్యారు. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం అక్టోబ‌ర్ 11న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. విడుద‌ల అయిన రోజునుండే హిట్ టాక్ తెచ్చుకున్న అర‌వింద స‌మేత‌కు.. అనుకోని వివాదాలు కూడా చుట్టుముట్టాయి. ఈ చిత్రంలో త‌మ భాష‌ను, అక్క‌డి ప్ర‌జ‌ల జీవితాల‌ను కించ‌ప‌ర్చార‌ని ఇటీవ‌ల హైద‌రాబాద్ ప్రెస్‌క్ల‌బ్‌లో రాయ‌ల‌సీమ‌కు చెందిన విద్యార్ధి సంఘాలు నిర‌స‌న వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఆ త‌ర్వాత కొంద‌రు విద్యార్ధులు ఓ ప్ర‌ముఖ టీవీ ఛాన‌ల్ నిర్వ‌హించిన డిబేట్‌లో పాల్గొని త‌మ సొంత ఊరికి వెళిపోయారు. ఆ త‌ర్వాత మ‌రో ఛాన‌ల్ చ‌ర్చావేధిక‌లో పాల్గొన‌డానికి…జలం శ్రీను, సీమ కృష్ణానాయక్, రవికుమార్, రాజశేఖర్ రెడ్డిలు హైద‌రాబాద్ బ‌య‌లుదేర‌గా తుంగ‌భ‌ద్రాన‌ది దాటిన త‌ర్వాత హైవే మీద జరిగిన రోడ్డు ప్ర‌మాదంలో జ‌లం శ్రీను అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించ‌గా.. మిగిలిన వారు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.ఈ విష‌యాన్ని వీరి స్నేహితుడు ఫేస్‌బుక్ ద్వారా ఒక పోస్టు పెట్ట‌డంతో పాటు.. వారి ఫొటోల‌ను కూడా షేర్ చేశారు. దీంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. దీంతో ఫేస్‌బుక్‌లో నెటిజ‌న్లు దిగ్బ్రాంతి వ్య‌క్తం చేస్తూ.. అర‌వింద స‌మేత వివాదం ఒక‌రిని బ‌లితీసుకుంద‌ని చ‌ర్చించుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments