అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ జెన్యూన్ టాక్.. మొద‌టి అర‌గంటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఊహించని విధంగా..!

Thursday, October 11th, 2018, 10:49:00 AM IST

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో తాజాగా తెర‌కెక్కిన చిత్రం అర‌వింద‌స‌మేత వీర‌రాఘ‌వ‌. భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ చిత్రం ఈ గురువార‌మే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌డంతో.. సినిమా హాళ్ళ వ‌ద్ద‌ అర్ధ‌రాత్రి నుండే నంద‌మూరి అభిమానుల హ‌డావుడ తారా స్థాయికి చేరుకుంది. ఇక ఇప్పటికే బెనిఫిట్ షోలు ప‌డ‌డంతో ఈ చిత్ర టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌రి నంద‌మూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్రేజీ కాంబినేష‌న్.. వారి అంచ‌నాల‌ను అందుకుందా లేదా అనేది తెలుసుకుందా.

అరవింద సమేత వీరరాఘవ సినిమా ఇప్పటికే ప్రివ్యూలు షోలు కంప్లీట్ అయిపోవ‌డంతో, ప్రేక్ష‌కుల నుండి సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం మెయిన్ ధీమే చాలా కొత్త‌గా ఉంద‌ని.. ఫ్యాక్ష‌న్‌కి అడ్డాయిన‌ రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించార‌ని.. క‌థ మొత్తం ఒకే ఒక్క లైన్‌లో చెప్పాలంటే.. యుద్ధం జ‌రిగాక కాదు.. యుద్ధం రాకుండా ఆపిన‌వాడే గొప్పోడు ఈ లైన్ మీద‌నే సినిమా మొత్తం ర‌న్ అవుతుద‌ని.. తెలుస్తోంది. రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌ల్లో త‌న తండ్రినికోల్పోయి రాఘ‌వ .. అక్క‌డ ఫ్యాక్షనిజాని పూర్తిగా ఆపాల‌ని ప్ర‌య‌త్నం చేస్తాడు.. అయితే రాఘ‌వ అనుకున్న‌ది సాధించాడా.. సాధిస్తే ఎలా సాధించాడు అనేది తెలుసుకోవాలంటే మాత్రం వెండితెర పై చూడాల్సిందే.

ఇక ఈ చిత్రంలో మ‌రో ముఖ్య‌మైన పాయింట్ ఏంటంటే.. రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ అంటేనే మ‌న‌కు చేతిలో క‌త్తి ప‌ట్టుకున్న మ‌గాళ్లు గుర్తుకు వ‌స్తారు. అయితే త్రివిక్ర‌మ్ మాత్రం ఫ్యాక్ష‌నిజాన్ని మ‌రోకోణాన్ని ఆవిష్క‌రించార‌ని చెబుతున్నారు. ఈ సినిమా ప్రారంభంలో మొద‌టి 25 నిమిషాలు.. సినిమా ఓ రేంజ్‌లో ఉంద‌ని.. ఎన్టీఆర్‌ న‌ట‌న‌, త్రివిక్ర‌మ్ సంభాష‌ణ‌లు, నేరుగా గుండెల్లో గుచ్చుకొని అల‌జ‌డులు సృష్టించాయ‌ని.. త్రివిక్ర‌మ్ రాసిన డైలాగులు ఎన్టీఆర్ త‌న‌దైన శైలిలో చెబుతుంటే థియేట‌ర్ మొత్తం హోరెత్తిపోయింద‌ని ప్రేక్ష‌కులు చెబుతున్నారు. ఒక తెలివైన ద‌ర్శ‌కుడు, ఒక బ‌ల‌మైన క‌థ‌, ఒక స‌రైన న‌టుడు క‌లిస్తే.. సినిమా ఎలా ఉంటుందో.. అదే అర‌వింద స‌మేత వీర‌రావ అంటున్నారు ప్రేక్ష‌కులు. ఇక చివ‌రిగా చెప్పాలంటే.. ఎన్టీఆర్ నుండి ఇలాంటి సినిమా వ‌స్తుంద‌ని ఆయ‌న అభిమాను అస్స‌లు ఊహించ‌లేద‌ని.. ఫైన‌ల్‌గా చెప్పాలంటే ద‌స‌రా కానుక‌గా వ‌చ్చిన అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ బ్లాక్ బ‌స్ట‌ర్ అని ప‌బ్లిక్ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌రి ఇంకెదుకు ఆల‌స్యం మీరు కూడా త్వ‌ర‌గా ఈ చిత్రాన్ని చూసేయండి.