అర‌వింద స‌మేత మూవీ సీన్స్.. తొలిరోజే సోషల్ మీడియాలో లీక్.. షాక్‌లో చిత్ర యూనిట్…?

Thursday, October 11th, 2018, 07:05:47 PM IST

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో, జూనియ‌ర్ ఎన్టీఆర్-పూజా హెగ్డెలు జంట‌గా తెర‌కెక్కించిన చిత్రం అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో.. ప్ర‌ముఖ నిర్మాత ఎస్ రాధాక్రిష్ణా ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రేర్ కాంబినేష‌న్, హైబ‌డ్జెట్, భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ చిత్రం ఈ గురువార‌మే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

ఫ‌స్ట్ షోనుండే హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం.. టాలీవుడ్‌లో అనేక‌ రికార్డులు బ‌ద్ద‌లు కొట్ట‌డం ఖాయ‌మ‌ని ప‌బ్లిక్ టాక్‌లో అభిమానులు కాలర్ ఎగ‌రేసుకుని మ‌రీ చెబుతున్నారు. అయ‌తే తొలిరోజు ఆట‌లు ఇంకా పూర్తి కాక‌ముందే ఈ చిత్రంలో కొన్ని సీన్లు సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌న మివ్వ‌డంతో చిత్ర యూనిట్‌తో పాట తార‌క్ అభిమానులు కూడా ఒక్క‌సారిగా షాక్‌కు గురౌతున్నారు.

అర్ధ‌రాత్రి నుండే అర‌వింద స‌మేత షోలు ప‌డ‌డంతో.. ఈ చిత్రాన్ని చూస్తూ కొంతమంది అభిమానులు వీడియోలను సోషల్ మీడియాలో చిత్రంలోని సీన్లను అప్లోడ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్‌తో పాటు ఫైట్ సీన్లు, పెనివిటి పాట‌ను కూడా సోష‌ల్ మీడియాలో పెట్టేశారు. కొంత‌మంది ఇది స‌ర‌దాకి చేసినా ఆయా సీన్ల లీక్‌ల వ‌ల్ల వెండితెర పై చూడాల‌నుకునే వారికి ఆశ‌క్తి త‌గ్గ‌డ‌మే కాకుండా చిరాకు తెప్పిస్తుంది. మ‌రి అర‌వింద స‌మేత సీన్లు ఇలా లీకులు అవ‌డంతో చిత్ర యూనిట్ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుందో చూడాలి.