33 కోట్లతో అర‌వింద‌ ఓపెనింగ్ రికార్డ్

Friday, October 12th, 2018, 02:32:54 PM IST

యంగ్‌య‌మ ఎన్టీఆర్ న‌టించిన `అర‌వింద స‌మేత‌- వీర రాఘ‌వ‌` తొలి రోజు ఏకంగా 27కోట్ల షేర్ వ‌సూళ్లు సాధించి తెలుగు రాష్ట్రాల్లో స‌రికొత్త రికార్డును అందుకుంది. అజ్ఞాత‌వాసి రికార్డును, రంగ‌స్థ‌లం రికార్డును ఈ సినిమా బ్రేక్ చేసింది.

ఏరియావైజ్ లెక్క‌లు ప‌రిశీలిస్తే…. నైజాం- 5.73కోట్లు, సీడెడ్ -5.48 కోట్లు, నెల్లూరు -1.06 కోట్లు, గుంటూరు-4.14కోట్లు, కృష్ణ‌- 1.97కోట్లు, తూర్పుగోదావ‌రి – 2.77కోట్లు, ప‌శ్చిమ‌గోదావ‌రి -2.37కోట్లు, ఉత్త‌రాంధ్ర -3.12 కోట్లు వ‌సూలైంది. ఏపీ, తెలంగాణ మొత్తంగా 26.64కోట్ల షేర్‌ వ‌సూల‌వ్వ‌గా, అటు అమెరికా నుంచి ప్రీమియ‌ర్ల రూపంలో మ‌రో 5.80 కోట్లు వ‌సూలు చేసిన సంగ‌తి తెలిసిందే. మొత్తంగా 33కోట్ల వ‌ర‌కూ మొద‌టిరోజు వ‌సూలైంది. బాహుబ‌లి-2 డే1 తెలుగు రాష్ట్రాల్లో 43 కోట్ల షేర్‌, అజ్ఞ‌త‌వాసి -27 కోట్ల షేర్ వ‌సూలు చేస్తే, `రంగ‌స్థ‌లం` తెలుగు రాష్ట్రాల్లో 20కోట్లు (వ‌ర‌ల్డ్ వైడ్ 46 కోట్లు) మేర వ‌సూలు చేసింది. అర‌వింద స‌మేత వ‌ర‌ల్డ్ వైడ్ 33కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 27కోట్లు వ‌సూలు చేసి నాన్ బాహుబ‌లి గ్రాఫ్‌లో టాప్ పొజిష‌న్‌కి చేరుకుంది.