6 రోజుల్లోనే “వీర రాఘవ రెడ్డి” వారం రోజుల రికార్డులు నరికేసాడబా..

Wednesday, October 17th, 2018, 05:58:55 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి సరైన హిట్ పడితే ఎలా ఉంటుందో అప్పుడు ఆదికేశవ రెడ్డి చూపించాడు. ఇప్పుడు వీర రాఘవ రెడ్డి చూపిస్తున్నారు.త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన “అరవింద సమేత వీర రాఘవ” దసరా కానుకగా ఈ నెల 11 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచింది.మాస్ ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలను త్రివిక్రమ్ తనదైన శైలిలో తెరకెక్కించడంతో కుటుంబ ప్రేక్షకులు కూడా బ్రహ్మ రథం పడుతున్నారు.

ఆరంభంలోనే పలు రికార్డులను సృష్టించిన ఈ చిత్రం విడుదలయ్యి 6 రోజులు అయ్యినా సరే అదే హవా కొనసాగిస్తోంది.తాజాగా ఈ చిత్రం మరో కొత్త రికార్డుని సృష్టించింది.సినిమా విడుదలైన మొదటి వారం రోజుల్లో అత్యధిక వసూళ్లు సాధించినటువంటి చిత్రాల యొక్క కలెక్షన్లను ఈ చిత్రం కేవలం 6 రోజుల్లోనే సాధించి నాన్ బాహుబలి రికార్డుని సృష్టించింది.ఈ చిత్రానికి ముందు వరుసలో రామ్ చరణ్ “రంగస్థలం”(77కోట్లు షేర్) చిరు “ఖైదీ నెం 150″(75కోట్లు షేర్) మరియు మహేష్ “భరత్ అనే నేను”(68కోట్లు షేర్) రాబట్టినట్టు తెలుస్తుంది.అయితే ఈ చిత్రాల యొక్క షేర్లు 7 రోజుల్లో సాధిస్తే వీర రాఘవుడు మాత్రం కేవలం 6 రోజుల్లోనే 78కోట్లు షేర్ రాబట్టినట్టు ట్రేడ్ పండితులు చెప్తున్నారు.వారు 7 రోజుల్లో సాధించిన రికార్డును తారక్ కేవలం 6 రోజుల్లోనే దాటెయ్యడం గమనార్హం..

  •  
  •  
  •  
  •  

Comments