అప్పుడే రికార్డుల వేట మొదలు పెట్టిన “వీర రాఘవ” రెడ్డి..!

Wednesday, October 3rd, 2018, 05:43:05 PM IST

నందమూరి అభిమానులు,యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంత గానో ఎదురు చూస్తున్న చిత్రం “అరవింద సమేత వీర రాఘవ” తన మాటల మాయతో చప్పట్లు కొట్టించగల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యొక్క ట్రైలర్ నిన్న రాత్రి విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది.నిన్న భారీ స్థాయిలో జరిగినటువంటి ప్రీ రిలీజ్ వేడుకలో తారక్ కంట తడికి ఉన్న పవర్ ని తన అభిమానులు లైక్స్,వ్యూస్ రూపంలో తాము అండగా ఉన్నామని చూపిస్తున్నారు.

నిన్న రాత్రి 8:10 నిమిషాలకు ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను విడుదల చేశారు.అంతే తారక్ ఆ ట్రైలర్లో చూపినట్టుగా శత్రువులను వేటాడినట్టు యూట్యూబ్ లో రికార్డులను వేటాడేస్తున్నాడు.ట్రైలర్ విడుదలయ్యి 24 గంటలు కాకముందే బాహుబలి మినహా అంతకు ముందు ఉన్న రికార్డులను తుడిచి పెట్టేసాడు.ఇది వరకు 24 గంటల్లో రెండులక్షల తొంబై ఆరువేల లైక్స్ అజ్ఞ్యాతవాసి పేరిట ఉన్న రికార్డును అరవింద సమేత వీర రాఘవ పేరిట కేవలం 19 గంటల్లోనే రాసేసుకున్నాడు.ఇప్పటికే మూడు లక్షల లైక్స్ ని కూడా దాటేసిఅంట్టు తెలుస్తుంది.ఇంకా సమయం ఉంది కాబట్టి వ్యూస్ విషయంలో కూడా అజ్ఞ్యాతవాసిని దాటేసే సూచనలు కూడా పుష్కలంగా ఉన్నాయని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.