త్రివిక్ర‌మ్‌పై మండి ప‌డ్డ ఫ్యాన్స్‌

Tuesday, October 2nd, 2018, 07:05:12 PM IST

సాయంత్రం రిలీజ్ చేసే అర‌వింద స‌మేత ట్రైలర్ ఇంత‌వ‌ర‌కూ ఫైన‌ల్ క‌ట్ హ‌డావుడిగా చేసేశారా? ట‌్రైల‌ర్ అంత నాణ్య ంగా లేదా? .. ప్ర‌స్తుతం తార‌క్ ఫ్యాన్స్‌లో హాట్ డిబేట్ ఇది. ట్రైల‌ర్ స‌హా ప్ర‌మోష‌న్ విష‌యంలో `అర‌వింద స‌మేత‌` టీమ్ అల‌స‌త్వంపైనా, త్రివిక్ర‌ముని కేర్‌లెస్ యాటిట్యూడ్ పైనా తార‌క్ ఫ్యాన్స్ కాస్తంత సీరియ‌స్‌గానే ఉన్నార‌ట‌!! సోష‌ల్ మీడియాలో వేడెక్కిస్తున్న హాట్ టాపిక్ ఇది.

ఎన్టీఆర్ న‌టిస్తున్న `అర‌వింద స‌మేత‌` అభిమానుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. దానికి కార‌ణం ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ అనుస‌రిస్తున్న విధాన‌మేన‌ని చెబుతున్నారు. హారిక అండ్ హాసిని బ్యాన‌ర్‌లో సినిమా అంటే అది కంప్లీట్‌గా త్రివిక్ర‌మ్ క‌నుస‌న్న‌ల్లో న‌డ‌ల‌వాల్సిందే. సినిమాకు సంబంధించిన ఏ నిర్ణ‌యం కూడా త్రివిక్ర‌మ్‌ను కాద‌ని తీసుకోవ‌డానికి వీలు లేదు. చిన్న స్టిల్‌.. టీజ‌ర్ రిలీజ్ డేట్…ఇలా ప్ర‌తీదీ త్రివిక్ర‌మ్ డిసైడ్ చేయాల్సిందే. అదే ఎన్టీఆర్ అభిమానుల‌ను పిచ్చెక్కిస్తోంది. త్రివిక్ర‌మ్ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం సినిమా ప‌బ్లిసిటీపై తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంద‌ని అభిమానులు త్రివిక్ర‌మ్‌పై మండిప‌డుతున్నారు.

అభిమానులు అశ‌గా ఎదురు చూస్తున్న `అర‌వింద స‌మేత‌` ట్రైల‌ర్ ఫైన‌ల్ క‌ట్ ఈరోజు వ‌ర‌కూ పూర్తికాలేదని చెప్పుకోవ‌డం హైలైట్. దీన్ని ఇటీవ‌లే హ‌డావిడీగా పూర్తిచేసి మ‌మా అనిపించార‌ట‌. ఈ రోజు (మంగ‌ళ‌వారం) రాత్రి టైలర్‌ను విడుద‌ల చేయ‌డానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఒక‌ పెద్ద హీరోకు చేయాల్సిన ప‌బ్ల‌సిటీ అస‌లు ఈ సినిమాకు లేనేలేదు. త్రివిక్ర‌మ్ ఆ దిశ‌గా అస‌లు ఆలోచ‌న‌లే చేయ‌డం లేదు. ఇదే అభిమానుల‌కు మింగుడు ప‌డ‌టం లేదు. ఎంత‌ స్టార్ డైరెక్ట‌ర్ అయితే మాత్రం అంత బిల్డ‌ప్ ప‌నికి రాద‌ని, ఇప్ప‌టికైనా ప‌బ్లిసిటీ ని ఓ రేంజ్‌లో మొద‌లుపెడితే త‌ప్ప ఎన్టీఆర్ సినిమాకు బూమ్ రాద‌ని వాపోతున్నార‌ట‌. ఇక అక్టోబ‌ర్ 11న ఈ చిత్రం రిలీజ‌వుతున్న వేళ ఇంకా 9రోజులే మిగిలి ఉంది. ఈలోగానే ఏం ప్ర‌చారం ఊద‌ర‌గొడ‌తారో అన్న ఆవేద‌న ఫ్యాన్స్‌లో వ్య‌క్తం అవుతోంది