ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు భారీ రికార్డు నమోదు చేసిన “అరవింద సమేత”

Friday, October 12th, 2018, 08:09:18 PM IST

అనుకున్న విధంగానే తారక్ భారీ రికార్డుల వైపు దూసుకెళ్తున్నారు.భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా “అరవింద సమేత వీర రాఘవ” చిత్రం నిన్న విడుదలయ్యింది.ఎన్టీఆర్ పూజ హెగ్డేలు హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేశారు,ఇప్పుడు ఈ చిత్రం భారీ రికార్డుల మీద కన్నేసిందా అంటే అవుననే చెప్పాలి ఎందుకంటే ఈ చిత్రం పలు చోట్ల బాహుబలి రికార్డులకు కూడా ఎసరు పెట్టింది ఇప్పటికే ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్లో 1 మిలియన్ మార్క్ ను దాటేసింది,దీనితో ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ కెరీర్లోనే భారీ రికార్డు నమోదయ్యింది.

దాదాపు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 56.7 కోట్లు కొల్లగొట్టినట్టు ట్రేడ్ పండితులు చెప్తున్నారు.ఈ చిత్రంతో తారక్ మొదటి రోజు అత్యధిక గ్రాస్ వసూలు చేసిన టాప్ 5 చిత్రాల్లో నిలిచాడు.ఈ చిత్రానికి ముందు వరుసలో బాహుబలి1 మరియు 2,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞ్యాతవాసి చిత్రాలు ఉన్నాయి.ఈ చిత్రానికి మంచి టాక్ కూడా సంతరించుకోవడంతో మరిన్ని రికార్డులు సృష్టించబోవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఎలాగో దసరా సెలవలు పెద్దగా సినిమాలు కూడా లేవు దీనికి తోడు చిత్రం కూడా బ్లాక్ బస్టర్ టాక్ కూడా తెచ్చుకుంది.ఇక దసరా బరిలో విజయ ఢంకా మోగించడమే తారక్ కి మిగిలి ఉంది.