మూవీ రివ్యూ : “అర్జున్ సురవరం”

టాలీవుడ్ లో కమర్షియల్ చిత్రాల నుంచి మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్టులు ఎన్నుకుంటాడు అనే స్టేజ్ కు హీరో నిఖిల్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అలా తన కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు చేసిన నిఖిల్ ఇప్పుడు టి సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన “అర్జున్ సురవరం” చిత్రంతో అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈరోజు విడుదల అయ్యింది.లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా జర్నలిజం మరియు థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ :

కథలోకి వెళ్లినట్టయితే అర్జున్ లెనిన్ సురవరం(నిఖిల్) బీబీసీ ఛానల్లో జర్నలిస్ట్ కావాలని కష్టపడుతుంటాడు.అలా ఓ చిన్న ఛానెల్లో పని చేస్తున్న అర్జున్ అనూహ్యంగా ఓ కేసులో ఇరుక్కుంటాడు.అలాగే మరోపక్క ఫేక్ సర్టిఫికెట్లను తయారు చేసే ఓ భయంకరమైన మాఫియా కథలోకి ఎంటర్ అవుతుంది.అసలు అర్జున్ తనకి సంబంధం లేని కేసులో ఎలా ఇరుక్కున్నాడు?ఈ మాఫియాకు తన కేసుకు ఏమన్నా సంబంధం ఉందా?ఈ నేపథ్యంలో హీరోయిన్ లావణ్య ఎలాంటి పాత్ర పోషించింది?అర్జున్ తాను నిరపరాధిగా బయటకు వచ్చాడా లేదా?దీనంతటి వెనుక ఉన్న వ్యక్తి అసలు ఆశయం ఏమిటి?లాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

హీరో నిఖిల్ తన కెరీర్ లో ఎన్నో చిత్రాలు చేసినా సరే తెలుగు ప్రేక్షకులు మాత్రం ఓన్ చేసుకుంది “స్వామిరారా” చిత్రం నుంచి అప్పటి నుంచి నిఖిల్ వైవిధ్యమైన చిత్రాలను ఎన్నుకోవడం మొదలు పెట్టాడు.అలా తనకంటూ ఓ మార్క్ ఏర్పరచుకొని అనేక బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నాడు.అలా ఇప్పుడు టి సంతోష్ తో చేసిన ప్రయోగం కూడా సఫలం అయ్యిందని చెప్పొచ్చు.

టి సంతోష్ ఇదే చిత్రాన్ని తమిళ్ లో “కనితన్”గా తెరకెక్కించి మంచి హిట్ అందుకున్నారు.అలాగే ఇప్పుడు తెలుగులో కూడా స్వీయ దర్శకత్వం వహించి నిఖిల్ కు మరో మంచి సినిమా అందించారని చెప్పొచ్చు.ఫస్ట్ హాఫ్ లో సినిమా మొదలు కథనం నెమ్మదిగా సాగినా అలా సినిమాలోకి లీనం చేస్తుంది.అలాగే కథానుసారం వచ్చే ట్విస్టులు కానీ హీరో మరియు విలన్ కు మధ్య సాగే సీన్స్ కానీ మంచి రసవత్తరంగా సాగుతూ పిల్లి ఎలుక ఆటను తలపిస్తాయి.

ముఖ్యంగా ఇంటర్వల్ కు ఓ 30 నిమిషాల సినిమా ఇంటర్వెల్ ట్విస్టులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.అదే విధంగా సెకండాఫ్ లో కూడా హీరో మరియు విలన్ ల మధ్య సాగే ఎపిసోడ్ లు కానీ సినిమాలోని కీలక అంశానికి సంబంధించిన ఒక్కో అంశం బయటకు రివీల్ అయ్యే సందర్భాలు కానీ సంతోష్ బాగా తెరకెక్కించారు.మంచి ఎమోషన్స్ సహా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను కూడా సమపాళ్లలో జోడించి బాగా తెరకెక్కించారు.అలాగే తాను చెప్పాలనుకున్న పాయింట్ ను సందేశాన్ని తెరకెక్కించిన తీరు బాగా వచ్చాయని చెప్పొచ్చు.

ఇక నటీనటుల విషయానికి వస్తే అర్జున్ లెనిన్ సురవరంగా నిఖిల్ అద్భుతమైన నటనను కనబర్చారు.సినిమా సినిమాకు పరిణితి చెందుతూ వచ్చిన నిఖిల్ ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్రకు పూర్తి న్యాయం చేకూర్చారు.అలాగే లావణ్య త్రిపాఠి కూడా చాలా బాగుంది.ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ కొన్ని కీలక సన్నివేశాల్లో కనబర్చిన నటన బాగున్నాయి.అలాగే నెగిటివ్ రోల్ లో కనిపించిన తరుణ్ అరోరా కమెడియన్ వెన్నెల కిషోర్ లు వారి పాత్రలకు సరైన న్యాయం చేసారు.రీసెంట్ బ్లాక్ బస్టర్ “ఖైదీ”కి సంగీతం అందించిన సామ్ సీఎస్ అందించిన పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సినిమాకు డీసెంట్ బూస్ట్ ను ఇస్తాయి.అలాగే సూర్య అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది.

ప్లస్ పాయింట్స్ :

కథ
ట్విస్టులు
బ్యాక్గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్ :

మొదటి 20 నిముషాలు
మొత్తం సీరియస్ గా సాగె కథనం
అంతగా కమర్షియల్ హంగులు లేకపోవడం

తీర్పు :

ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ అర్జున్ లెనిన్ సురవరం మొదట్లో నెమ్మదిగా మొదలైనా దర్శకుడు టి ఎన్ సంతోష్ తెరకెక్కించిన తీరు తాను చెప్పాలనుకున్న పాయింట్ ను తెలుగు నేటివిటీకి కూడా బాగా ఆవిష్కరించడంలో విజయం సాధించారని చెప్పొచ్చు.ఆసక్తికరంగా సాగే కథ కథనాలతో పాటుగా మంచి సందేశం కూడా వీక్షకులను థ్రిల్ ను ఇచ్చి తప్పక రంజింపజేస్తాయి.కానీ కమర్షియల్ హంగులు తక్కువ కావడం ఈ చిత్రాన్ని ఎంత వరకు తీసుకెళ్తాయో చూడాలి.

Rating: 3/5