బాలీవుడ్ లో రీమేక్ కానున్న అరుంధతి…జేజమ్మ పాత్రలో ఎవరంటే!?

Wednesday, July 22nd, 2020, 10:35:54 PM IST

తెలుగు సినీ పరిశ్రమ లో ఇండస్ట్రీ హిట్ మాత్రమే కాదు, ఎన్నో సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది అరుంధతి చిత్రం. అనుష్క ను లేడీ సూపర్ స్టార్ గా చేసిన చిత్రమిది. అయితే ఈ చిత్రాన్ని ఎప్పటినుండో బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక వార్త ఫిల్మ్ నగర్ లో చెక్కర్లు కొడుతుంది. ఈ చిత్ర రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

అయితే ఒక వేళ ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయాల్సి వస్తే అందుకు దీపికా పదుకునే కరెక్ట్ గా సూట్ అవుతుంది అంటూ కొందరు అంటుండగా,దీపికా ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మాత మధు తో కలిసి నిర్మించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరి దీని పై అల్లు అరవింద్ అధికారికంగా ఎపుడు ప్రకటిస్తారో చూడాలి. ఈ చిత్రాన్ని దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ అద్భుతంగా తెరకెక్కించారు. భారీ నిర్మాణ విలువలతో నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించారు. అరుంధతి పాత్రలో అనుష్క నటించగా, పశుపతి పాత్రలో సోను సూద్ నటించారు.