ప్రీమియర్ షో టాక్ : అరవింద సమేత

Thursday, October 11th, 2018, 05:35:24 AM IST

భారీ అంచనాల నడుమ ఈ రోజు విడుదలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇక మనకు వస్తున్న ప్రీమియర్ షో రిపోర్ట్ ప్రకారం సినిమా ఎబో యావరేజ్ అంటున్నారు. ఫస్ట్ హాఫ్ ను డీసెంట్ గా మలిచిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో తన ప్రతిభను చూపెట్టుకున్నాడు. ఎమోషనల్ సన్నివేశాలతో సినిమాను ఆసక్తికరంగా మలచడంలో త్రివిక్రమ్ విజయం సాధించాడు.

ఫస్ట్ హాఫ్ లో మొదటి 20నిమిషాలు అలాగే ఇంటర్వెల్ ఎపిసోడ్ హైలైట్ అవ్వగా సెకండ్ హాఫ్ లో బలమైన డైలాగ్స్ , ఎమోషనల్ సీన్స్ సినిమాకు విజయాన్ని అందించాయి. ఇక మైనస్ విషయానికి వస్తే కామెడీ లేకపోవడం , ఫస్ట్ హాఫ్ లో కొన్ని చోట్ల కథనం నెమ్మదించడం. ఓవరాల్ గా తారక్ ఈచిత్రం తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నట్లే. ఇక ‘అజ్ఞాతవాసి’ చిత్ర వైపల్యం తరువాత త్రివిక్రమ్ ఈచిత్రం తోమళ్ళి బౌన్స్ బ్యాక్ అయ్యాడని అంటున్నారు. పూర్తి రివ్యూ కోసం నేటి ఏపి.కామ్ ను చూస్తూ వుండండి.