మీటూ లిస్ట్ లో లక్స్ పాప .. నాకు వేధింపులు తప్పలేదు ?

Tuesday, October 9th, 2018, 08:27:09 PM IST

లైంగిక వేధింపులు, టార్చర్ పై ఈ మధ్య పలువురు హీరోయిన్స్ బాహాటంగా స్పందిస్తున్నారు . ఈ మద్యే తను శ్రీ దత్త రేపిన వివాదంతో ఇంకొంతమంది స్పందించారు . ఈ లిస్ట్ లోకి వచ్చింది ఆశ షైనీ .. అలియాస్ ఫ్లోరా షైనీ. ఏంటి ఆశ షైనీ ఎవరో గుర్తురావడం లేదా … అప్పట్లో నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన నరసింహ నాయుడు సినిమాలో లక్స్ పాప లక్స్ పాప లంచ్ కోస్తావా అంటూ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆశ షైనీ గుర్తుందిగా. ఆ తరువాత చాలా చిత్రాల్లో నటించిన ఈమె అసలు పేరు ఫ్లోరా షైనీ. తాజాగా తానుకూడా ఇలాంటి దారుణాలు ఎదుర్కొన్నానని పేర్కొంది.

పదకొండేళ్ళక్రితమే తాను గోరమైన అనుభవాలను చూశానని తెలుపుతూ .. గాయాలతో ఉన్న తన ఫోటోని పోస్ట్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. 2007 లో తాను గౌరంగ్ దోషి తో ఘాటు ప్రేమాయణం సాగించానని, అప్పుడు ప్రేమికుల దినోత్సవం రోజున గౌరంగ్ నన్ను బాగా కొట్టి హింసించాడని, అతని క్రూరత్వానికి నా దవడ ఫ్రాక్చర్ అయిందని తెలిపింది. అతనితో డేటింగ్ చేసిన ఆ ఏడాది నరకం అనుభవించానని తెలిపింది. ఈ విషయాన్నీ అప్పుడే బయటపెట్టాను .. కానీ ఎవరు నమ్మలేదు. ఎందుకంటే గౌరంగ్ ప్రతిష్ట వల్ల నా మాట ఎవరు నమ్మలేదు .. అతనే నాకు అవకాశాలు రాకుండా చేసాడని, అతనివల్ల చాలా అవకాశాలు పోయాయని తెలిపింది. నేనే కాదు అతని వల్ల చాలామంది అమ్మాయిలు కష్ఠాలు అనుభవించారని తెలిపింది. ఇప్పుడు నోరు విప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఈ పోస్ట్ పెడుతున్నాను అంటూ కామెంట్ పెట్టింది ఆశ !!