“అత్తారింటికి దారేది”కి వచ్చిన రిజల్టే ఇప్పుడు “టాక్సీవాలా”కి కూడా..?

Sunday, November 18th, 2018, 10:07:18 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ”అత్తారింటికి దారేది” చిత్రం విడుదలకు ముందే పైరసీకి గురి కాబడి,విడుదలయిన తర్వాత ఇండస్ట్రీ హిట్ అయిన సంగతి తెలిసిందే.అయితే విడుదలకు ముందే ఫుల్ క్లారిటీ ఉన్న చిత్రం లీక్ అయినా సరే చిత్రం బాగుండడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.దీనితో పవన్ స్టామినా ముందు పైరసీ ప్రభావం నిలబడలేకపోయింది.ఇప్పుడు అదే పరిస్థితి రౌడీ హీరో విజయ్ దేవరకొండకు కూడా ఎదురవుతుందా అని ఇది వరకే మనం చర్చించుకున్నాం.

ఇప్పుడు ఆ మాటలను నిజం చేస్తూనే విజయ్ “టాక్సీవాలా” చిత్రంతో మరో హిట్ కొట్టేసాడు.ఈ సినిమా కూడా విడుదలకు ముందే పైరసీ అయ్యింది.కట్ చేస్తే నిన్న విడుదలయిన ఈ చిత్రం ఒక్క రోజులోనే విజయ్ దెబ్బకు బ్రేకీవెన్ దశకు చేరుకుంది అని వారి యొక్క చిత్ర యూనిట్ తెలిపారు.అయితే ఒక మంచి కంటెంట్ ఉన్న చిత్రం విడుదలకు ముందే బయటకి వచ్చేసినా సరే పైరసీ భూతం ఏమి చెయ్యలేదు అని ప్రేక్షకులు తేల్చి చెప్పేసారు.