24 గంట‌ల మార‌థాన్‌తో బాక్సాఫీస్ షేక్‌!

Friday, October 12th, 2018, 01:54:45 PM IST

మ‌ల‌యాళ యువ‌హీరో నివిన్ పాళీ న‌టించిన‌ `కాయంకుల‌మ్ కొచ్చున్ని` గ‌త కొంత‌కాలంగా హాట్ టాపిక్‌. ఈ చిత్రంలో మోహ‌న్‌లాల్ లాంటి సూప‌ర్‌స్టార్ అతిధి పాత్ర పోషించ‌డం, అటుపై ఆ ఇద్ద‌రూ ఉన్న ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌డంతో ఒక‌టే ఉత్కంఠ నెల‌కొంది. ఇక ఆంగ్లేయుల‌పై కొంద‌రు థ‌గ్స్ సాగించిన పోరాటం నేప‌థ్యంలో రూపొందించిన ఈ చిత్రం విజువ‌లైజేష‌న్ ప‌రంగా కొత్త‌గా ఉంటుంద‌ని ప్ర‌చారం సాగించారు. అక్టోబ‌ర్ 11న ఈ భారీ చిత్రం కేర‌ళ వ్యాప్తంగా దాదాపు 350 కేంద్రాల్లో రిలీజైంది.

అందుకు త‌గ్గ‌ట్టే మొద‌టిరోజు రికార్డుల్ని బ్రేక్ చేసింది ఈ చిత్రం. ఇండియాలో ఇన్నేళ్ల‌లో ఎవ‌రూ చేయ‌ని రీతిలో ఈ చిత్రాన్ని 24 గంటల‌ మార‌థాన్ షోస్ అంటూ రోజంతా షోల‌తో మోతెక్కించారు. దీంతో డే1లో ఏకంగా 5-6కోట్లు వ‌సూలు చేసి రికార్డులు నెల‌కొల్పింద‌ని చెబుతున్నారు. 3.5 కోట్ల వ‌ర‌కూ అధికారిక లెక్క‌లు తేలితే, మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంద‌ని క్రిటిక్స్ చెబుతున్నారు. `ది గ్రేట్ ఫాద‌ర్`, మోహ‌న్ లాల్ – పులి మురుగ‌న్ రికార్డుల్ని బ్రేక్ చేయ‌నుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. 24 గంట‌ల మార‌థాన్ రిలీజ్ ఓపెనింగుల‌కు క‌లిసొచ్చింది. ఇక అక్క‌డ హిట్ట‌య్యింది కాబ‌ట్టి టాలీవుడ్‌లోనూ ఈ చిత్రాన్ని అంతే భారీగా రిలీజ్ చేసి క్యాష్ చేసుకుంటార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.