బాహుబలి ప్రభాస్ లవ్ మ్యారేజ్?

Sunday, August 18th, 2019, 11:39:21 AM IST

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ అనగానే ప్రతి ఒక్కరు చెప్పే పేరు ప్రభాస్. సాహో చిత్రం ప్రొమోషన్స్ లో భాగంగా తిరుగుతున్నా ప్రభాస్, మీడియా ఒక ఆసక్తికర ప్రశ్నని అడిగింది. పెళ్లి ఎపుడు చేసుకుంటున్నారు? అని అడిగిన ప్రశ్నకి, డార్లింగ్ ఇలా రిప్లై ఇచ్చారు. ” టైం వచ్చినపుడు, జరగాల్సిన సమయం లో పెళ్లి జరుగుతుందని, అది ప్రేమ వివాహం ఐన కావొచ్చు” అని అన్నారు.

సాహో చిత్రం గురించి బడ్జెట్ గురించి పలు ప్రశ్నలు అడిగారు. రెమ్యూనరేషన్ గురించి అడగగా, ఒక యాక్షన్ సన్నివేశానికి 80 కోట్ల వరకు ఖర్చు అయ్యాయని, అందులో ఒక భాగం నా రెమ్యూనరేషన్ అని తెలియ చేసారు. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ ప్రభాస్ ఫ్రెండ్స్ ది అయి ఉండుట వలన రెమ్యూనరేషన్ కాకపోయినా లాభాల్లో వాటా ఐన తీసుకొనే అవకాశం వుంది.

ఈ ఆదివారం రామోజీ ఫిలిం సిటీ లో ఘనంగా సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వ్హహించనున్నారు. సుజిత్ దార్శకత్వ వహించిన ఈ చిత్రం లో ప్రభాస్ కి జోడిగా శ్రద్ధ కపూర్ నటిస్తుండగా, ఈ చిత్ర బడ్జెట్ 300 కోట్ల దాటిందని సమాచారం. తెలుగుతో పటు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఆగష్టు 30 న సాహో విడుదలకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.