మరోసారి కలిసిన బాహుబలి టీం…ఎందుకో తెలుసా?

Saturday, October 19th, 2019, 02:42:07 PM IST

బాహుబలి చిత్రం తో తెలుగు స్టామినా ఏంటో తెలియజేసారు రాజమౌళి. తెలుగు చిత్రానికి అంతర్జాతీయ మార్కెట్ ని క్రియేట్ చేయడంలో బాహుబలి చిత్రం విజయవంతమైంది. అయితే ప్రభాస్, రానా, రాజమౌళి, అనుష్క, శోబు యార్లగడ్డ మరొకసారి కలవడం పట్ల తెలుగు ప్రజలలో ఒక చిన్న అనుమానం మొదలయ్యింది. కానీ వీరు కలుసుకున్నది బాహుబలి చిత్రం కోసమే. బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ అదే తరహాలో పాన్ ఇండియన్ మూవీ సాహో చిత్రంలో నటించారు.

అయితే లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ చాల ప్రసిద్ధి చెందినది. అక్కడ బాహుబలి చిత్రాన్ని శనివారం ప్రదర్శించడం జరిగింది. అయితే ఈ ప్రదర్శన సమయంలోనే ఎమ్ ఎమ్ కీరవాణి సంగీత విభావరి ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని చూడబోతున్నట్లు రాజమౌళి సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. అయితే అవంతిక పాత్ర పోషించిన తమన్నా కనిపించకపోవడం పట్ల ఆడియన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా తెలుగు సినిమా ని ప్రపంచవేదిక మీద పెట్టిన ఘనత బాహుబలికే దక్కింది.