బాహుబలికి ధీటుగా డీజే

Thursday, October 26th, 2017, 02:32:38 PM IST

ఈ మధ్య కాలంలో సినిమాలు వెండి తెరపైనే కాదు బుల్లి తెరపై కూడా రికార్డులు నమోదు చేస్తున్నాయి. రీసెంట్ గా తెలుగు టీవీ ఛానెల్స్ లో స్టార్ హీరోల ప్రీమియర్ షోలు బాగానే వచ్చాయి. బాహుబలి 2 తో పాటు అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథమ్ అలాగే నేనే రాజు నేనే మంత్రి సినిమాలు బుల్లి తెరపై పండగ సందడిని చేశాయి. ఇక రెండేళ్ల తర్వాత అనుష్క రుద్రమదేవి కూడా ఫైనల్ గా తొలి సారి టీవీల్లో దర్శనం ఇచ్చింది.

ఇక అసలు విషయానికి వస్తే.. ఈ స్టార్స్ సినిమాల్లో బాహుబలి 2 టాప్ రెంటింగ్ ను సంపాదించుకుంది. అక్టోబర్ 8న బాహుబలి 2 తెలుగులో స్టార్ మా ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. దేశం మొత్తంగా అన్ని భాషల్లో ఒకే రోజు టెలికాస్ట్ అవ్వడంతో చాలా మంది చూశారు. హిందీ తమిళ్ లో ఆ సినిమా సాధించిన రేటింగ్ దరిదాపున ఈ మధ్య కాలంలో ఏ సినిమా రాలేదు. అయితే తెలుగులో మాత్రం బాహుబలి ప్రభాస్ కి స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం గట్టి పోటీని ఇచ్చాడని చెప్పవచ్చు. ఎందుకంటే స్థార్ మా ప్రసారం చేసిన బాహుబలి 2కి ఆ రోజు 23 TRP ని అందుకుంటే. అక్టోబర్ 14న ప్రసారమైన అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథమ్ సినిమా 22 TRP ని అందుకుంది.

బాహుబలి 2 సినిమా వెండితెరపై ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డులన్నిటిని బద్దలు కొట్టిన సినిమా టీవీల్లో వస్తుందంటే ఆ క్రేజ్ మాములుగా ఉండదు. రేటింగ్ అన్నిటికంటే ఎక్కువగా వస్తుందని అనుకున్నారు. రేటింగ్ బాగానే వచ్చింది. కానీ ఎన్నో నెగిటివ్ కామెంట్స్ ని రివ్యూస్ ని అందుకున్న డీజే బాహుబలి కంటే ఒక్క పాయింట్ తక్కువ రావడం అన్నది చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక బాహుబలి 2 సినిమా ప్రసార సమయం మధ్య మధ్యలో చిత్ర యూనిట్ విశేషాలు చెప్పడంతో పాటు సోషల్ మీడియాలో పబ్లిసిటీ కూడా బాగానే చేశారు కానీ డీజే మాత్రం చాలా సింపుల్ గా ఎటువంటి అంచనాలు లేకుండా టెలికాస్ట్ అయ్యింది. ఆ రోజు టెలికాస్ట్ అయ్యిన సినిమాలో డీజే ఎంటర్టైన్మెంట్ గా ఉండడంతో ఆ స్థాయిలో రేటింగ్ ను అందుకుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.