డ్రాగ‌న్ కంట్రీలో 6000 థియేట‌ర్ల‌లో ఎటాక్‌!

Thursday, April 19th, 2018, 10:45:24 PM IST

ఇండియా మార్కెట్ పాత మాట‌. చైనా మార్కెట్ కొత్త మాట‌. ఇక్క‌డి కంటే అక్క‌డ రిలీజ్ ఎంతో ఇంపార్టెంట్ అయిపోయింది. చైనాలో స‌క్సెసైతే, ఇండియాలో వ‌చ్చే మొత్తం కంటే దాదాపు మూడు రెట్లు అధికంగా ఆర్జించ‌వ‌చ్చ‌న్న అంచ‌నా వేస్తున్నారు మ‌న మేక‌ర్స్‌. అయితే అందుకు కార‌ణం లేక‌పోలేదు. ఇటీవ‌ల రిలీజైన అమీర్ ఖాన్‌ దంగ‌ల్‌, సీక్రెట్ సూప‌ర్‌స్టార్ విజ‌యాలే అందుకు కార‌ణం. ఈ సినిమాలో ఇండియా బ‌క్సాఫీస్ కంటే రెట్టింపు విజ‌యం చైనాలో సాధించాయి. దాంతో మ‌న మేక‌ర్స్ ఉత్సాహంగా అటువైపు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. స‌ల్మాన్ భ‌జ‌రంగి భాయిజాన్‌, ఇర్ఫాన్ హిందీ మీడియం.. చైనాలో అఖండ విజ‌యం సాధించాయి. దాంతో మ‌రింత ఉత్సాహం పెరిగింది. ఇక బాహుబ‌లి 2 వంతు. ఈ సినిమాని చైనాలో రిలీజ్ చేసేందుకు ఆర్కామీడియా భారీ ప్లాన్ చేస్తోంది. మే 4న చైనాలో ఏకంగా 6000 థియేట‌ర్లలో బాహుబ‌లి -2 చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తోంది. ఇన్‌క్రెడిబుల్ హ‌ల్క్ , విన్సెంట్ త‌బ‌లియ‌న్ చిత్రాల ఎడిట‌ర్ ఇప్ప‌టికే ఇంట‌ర్నేష‌న‌ల్ ట్రైల‌ర్‌ని క‌ట్ చేశారుట‌. `బాహుబ‌లి-1` రిలీజ్ చేసిన ఈ-స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ తాజాగా పార్ట్ 2ని రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఒక‌వేళ బాహుబ‌లి -2 సైతం దంగ‌ల్ త‌ర‌హాలో విజ‌యం సాధిస్తే ఇది ఇండియ‌న్ సినిమా మార్కెట్‌కే కాక‌, ప్రాంతీయ సినిమా మార్కెట్ కి పెద్ద బూస్ట్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. `సైరా`కు అది క‌లిసొస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments