సీనియర్ నర్తకితో బాలయ్య స్టెప్పులు!

Monday, August 24th, 2015, 09:46:59 PM IST


ప్రముఖ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ అటు సినిమాలతో పాటు ఇటు రాష్ట్ర అభివృద్ధిలోనూ బిజిబిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో బాలయ్య మరింత ఉత్సాహంగా ఫంక్షన్ లలో పాల్గొంటూ, చలాకీగా తిరుగుతూ, సెల్ఫీలు తీసుకుంటూ, వేదికలపై డాన్సులు చేస్తూ, అందరినీ ఉత్సాహపరుస్తూ సందడి చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే బాలయ్య ఇటీవల హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగిన ‘సంతోషం’ అవార్డు ప్రదానోత్సవ వేడుకలో సీనియర్ డాన్సర్ జ్యోతిలక్ష్మితో కలిసి స్టెప్పులేసి ఆహుతులను ఆకర్షించారు. ఇక మరో వైపు ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి 60వ జన్మదిన వేడుకలలో కూడా బాలయ్య డాన్సు చేసి అభిమానులకు కనువిందు చేసిన సంగతి తెలిసిందే.