బాలయ్యకి కోపమే కాదు ప్రేమించడము తెలుసు…

Saturday, October 19th, 2019, 12:30:49 AM IST

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన కార్యకర్తకులను ఎప్పటికి తిడుతూ, కొడుతుంటాడని, ఎల్లప్పుడూ విమర్శలు ఏడుకుంటూనే ఉంటాడు. కాగా తాజాగా ఒక అభిమాని పై తన ఔదార్యాన్ని ప్రదర్శించారు నందమూరి బాలకృష్ణ. తన అభిమానుల విషయంలో బాలయ్య చాలా ప్రేమను చూపిస్తాడని తాజాగా జరిగినటువంటి ఒక సంఘటన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాగా జీ తెలుగులో ‘డ్రామా జూనియర్స్‌’ కార్యక్రమం ద్వారా జూనియర్ బాలయ్య గా పేరు తెచుకున్నటువంటి గోకుల్ సాయి అనే ఆరేళ్ళ పిల్లడు నేడు తీవ్రమైన అస్వస్థత కారణంగా అకస్మాత్తుగా కన్ను మూశాడు.

సినిమాల్లోబాలయ్య చెప్పే డైలాగులని సేమ్ అలాగే దించేసేవాడు గోకుల్. కాగా అయితే తన మరణ వార్తని తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. ఈమేరకు ఒక లేఖను కూడా విడుదల చేశారు బాలకృష్ణ. కాగా “నేనంటే ప్రాణం ఇచ్చే ఈ చిన్నారి ఈ రోజు ప్రాణాలతో లేడన్న నిజం నా మనసును కలిచివేసింది. ఆ చిన్నారి డైలాగులు చెప్పే విధానం.. హావభావాలు చూసి నాకు ఎంత ముచ్చటేసిది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ చిన్నారి ఇంత చిన్న వయసులో డెంగ్యూ వ్యాధితో ఈ లోకాన్ని విడిచి వెళ్లడం చాలా బాధ కలిగించింది. ఈ చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా” అంటూ తన లేఖలో పేర్కొన్నారు బాలయ్య బాబు…