షాక్ .. శ్రీరెడ్డి కి బాలయ్య సపోర్ట్ ?

Sunday, April 22nd, 2018, 10:47:21 PM IST


ప్రస్తుతం టాలీవుడ్ లో సంచలనం రేపుతున్న కాస్టింగ్ కౌచ్ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్రంగా మారింది. ఈ విషయం పై నటి శ్రీ రెడ్డి గత కొన్ని రోజులుగా రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమెతో పాటు మరికొంతమంది నటీమణులు కూడా పోరాటం చేస్తున్నారు .. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి .. ఇతర నటీమణులకు ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ మద్దత్తు ప్రకటించారు ? కాస్టింగ్ కౌచ్ పై కొందమంది పోరాటం చేయడం మంచి పరిణామమే అంటూ పరోక్షంగా శ్రీ రెడ్డి కి బాలయ్య సపోర్ట్ అందించారు. ఈ పోరాటాం ఎక్కడి వరకు వెళుతుందో చూద్దామని అన్నారు. బాలయ్య నటించిన జై సింహ సినిమా నేటితో వందరోజులు పూర్తీ చేసుకున్న నేపథ్యంలో ఈ రోజు చిలకలూరిపేట లో వందరోజుల వేడుక నిర్వహించారు . ఈ వేడుకలో బాలయ్య మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తున్న వారికీ నా మద్దతు ఉంటుందని అన్నారు. చెడుపై ఎవరు పోరాటం చేసినా తాను స్వాగతిస్తామని చెప్పాడు బాలయ్య. మరి ఈ విషయం పై అటు మెగాఫ్యాన్స్ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments