మహేష్-అనీల్ సినిమాలో కూడా బండ్ల “7’O క్లాక్ బ్లేడ్ “..?

Tuesday, June 4th, 2019, 05:10:33 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లాస్ట్ రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలవడంతో ఇప్పుడు అదే జోరును కొనసాగిస్తూ హ్యాట్రిక్ విజయాన్ని అందుకునే పనిలోనే ఏమాత్రం లేట్ చెయ్యకుండా వరుస విజయాల చిత్రాల దర్శకుడు అనీల్ రావి పూడి దర్శకత్వంలో “సరిలేరు నీకెవ్వరు” అనే చిత్రాన్ని మొదలు పెట్టిన సంగతి కూడా తెలిసిందే.అయితే ఈ సినిమా తోనే ప్రముఖ సీనియర్ కమెడియన్,నిర్మాత మరియు పొలిటిసియన్ బండ్ల గణేష్ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారన్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాలో బండ్ల గణేష్ పాత్రను “బంగారు బాబుగా అనీల్ ఓ రేంజ్ లో తన ముందు సినిమాలలా ఎక్కడా తగ్గకుండా తెరకెక్కించనున్నారట.మరీ ముఖ్యంగా ఈ సినిమాలో బండ్ల గణేష్ నిజజీవితంలో “7’O క్లాక్ బ్లేడ్”తో గొంతు కోసుకుంటా అని చెప్పిన మాటలు ఎంతటి ఫన్ ను జెనరేట్ చేశాయో అందరికీ తెలిసిందే.ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ను ఈ చిత్రంలో కూడా బండ్ల ద్వారా చెప్పించి నవ్వులు పూయిస్తారట.

ఈ సినిమాలో బండ్ల పేరుకు తగ్గట్టుగానే మొత్తం బంగారు గొలుసులు ఉండగరాలతో కనిపిస్తారని టాక్.ఇదే సందర్భంలో అతన్ని ఎవరైనా ఏమన్నా అంటే చాలు బ్లేడ్ తో గొంతు కోసుకుంటా అని చెప్తారట.ఈ సీన్లు అనీల్ రావిపూడి ముందు సినిమాల్లోలా తనదైన మార్క్ లో కడుపుబ్బా నవ్విస్తాయని సినీ వర్గాల నుంచి అంతర్గత సమాచారం.మరి ఈ చిత్రంలో బండ్ల ఏ రేంజ్ లో సందడి చేయనున్నారో తెలియాలంటే వచ్చే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.