నాకు సినిమానే జీవితం…సినిమానే ప్రాణం – బండ్ల గణేష్

Tuesday, May 19th, 2020, 07:54:42 PM IST

బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న నిర్మాత బండ్ల గణేష్. అయితే తాజాగా బండ్ల గణేష్ తో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం కోల్పోయిన సంఘటన ఒకటి గుర్తు చేసుకున్నారు. బాహుబలి చిత్రం తో ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ హీరో గా పేరు తెచ్చుకున్న ఏకైక టాలీవుడ్ హీరో. అయితే గతంలో ప్రభాస్ తనకు డేట్స్ ఇచ్చారని వివరించారు. అయితే సినిమా చేయాలని ఉంది అని అడగ్గా వెంటనే ఒప్పుకున్నారు అని వ్యాఖ్యానించారు. చెన్నై కి చేరి వెళ్లి లారెన్స్ తో మాట్లాడమని అడిగిన విషయాన్ని వెల్లడించారు. అయితే ఆరోజు ఎందుకో కొంచెం భయపడి వెనకడుగు వేసిన విషయాన్ని వెల్లడించారు.

అయితే ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం మిస్ అయ్యా అని, ఇలా మిస్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నడుస్తున్న వెబ్ సీరీస్ ల హవా పై ప్రశ్నించగా, తనకు వెబ్ సీరీస్ ల పై ఆసక్తి లేదు అని అన్నారు. అంతేకాక సినిమాలే నాకు కిక్ ఇస్తాయని అన్నారు. అయితే డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి అని వ్యాఖ్యానించారు. నాకు సినిమా నే జీవితం, సినిమానే ప్రాణం అంటూ వ్యాఖ్యానించారు. బండ్ల గణేష్ ఇక పై కూడా సినిమాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.