బెబో క‌రీనా ఫిట్‌నెస్ ట్రైన‌ర్ ఎవ‌రో తెలుసా?

Tuesday, February 27th, 2018, 06:01:32 PM IST

అందం కాపాడుకునేందుకు బెబో క‌రీనా ఎంత శ్ర‌ద్ధ తీసుకుంటుందో తెలిసిందే. నిరంత‌రం ఓ సుశిక్షితురాలైన కోచ్ స‌మ‌క్షంలో జిమ్ చేస్తుంది. ఓ క్ర‌మ‌ప‌ద్ధ‌తి ప్ర‌కారం త‌న‌కు కావాల్సిన ఔట్‌పుట్ సాధించ‌డం బెబోకే చెల్లిన‌ ప్ర‌త్యేక‌త‌. అయితే త‌న శ్ర‌మ‌కు త‌గ్గ‌ట్టే స‌రైన ఫిట్‌నెస్ ట్రైన‌ర్ అంతే ఇంపార్టెంట్‌. క‌రీన‌, జాక్విలిన్‌, ఐశ్వ‌ర్యారాయ్ స‌హా ఎందరో టాప్ స్టార్ల‌కు ప‌ర్స‌న‌ల్ కోచ్ గా కొన‌సాగుతోంది ఎవ‌రో తెలుసా? తెలుసుకోవాల‌నుంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

బాలీవుడ్‌లో ఎంద‌రో స్టార్ల‌కు ప‌ర్స‌న‌ల్ ఫిజిక‌ల్ ట్రైన‌ర్‌గా సుదీర్ఘ అనుభ‌వం ఉన్న మేటి ట్రైన‌ర్ న‌మ్ర‌త పురోహిత్‌. ప‌లువురు అగ్ర క‌థానాయిక‌ల‌కు త‌నే ట్రైన‌ర్‌గా కొన‌సాగుతున్నారు. న‌వ‌త‌రం క‌థానాయిక‌లు త‌మ దేహాకృతిని మార్చుకునేందుకు నమ్ర‌త పురోహిత్ వ‌ద్ద శిక్ష‌ణ తీసుకుంటున్నారు. అస‌లు బెబో క‌రీనాక‌పూర్ ఓ బిడ్డ‌కు త‌ల్లి అయ్యాక తిరిగి పాత రూపానికి మారేందుకు సాయ‌ప‌డింది న‌మ్ర‌త‌నే. న‌డుము చుట్టూ ఉండే కొలెస్ట‌రాల్‌ను, ఇత‌ర‌త్రా బ‌రువును తొల‌గించుకునేందుకు క‌రీన‌కు క‌ఠోర‌మైన ట్రైనింగ్ ఇచ్చారు న‌మ్ర‌త‌. బెబోకి న‌మ్ర‌త ఎలాంటి శిక్ష‌ణ‌నిస్తోందో ఇదిగో ఈ వీడియో చూస్తే అర్థ‌మ‌వుతుంది. ప్ర‌స్తుతం జోరుగా వైర‌ల్ అవుతున్న ఈ వీడియోని మీరూ వీక్షించండి.