రివ్యూ రాజా తీన్‌మార్ : భాగమతి – అన్నీ తానై నడిపిన అనుష్క

Saturday, January 27th, 2018, 06:57:12 PM IST

తెరపై కనిపించిన వారు : అనుష్క, ఉన్ని ముకుందన్

కెప్టెన్ ఆఫ్ ‘ భాగమతి ‘ : జి. అశోక్

మూల కథ :

చంచల (అనుష్క) ఒక ఐ.ఎస్.ఎస్ ఆఫీసర్. ఆమె ఒక ప్రముఖ మంత్రి ఈశ్వర్ ప్రసాద్ (జైరామ్) వద్ద పర్సనల్ సెక్రెటరీగా భాయతలు నిర్వర్తిస్తూ ఒక హత్య కేసులో అరెస్టవుతుంది. అలా కస్టడీలో ఉన్న ఆమెను పోలీసులు రహస్య విచారణ కొరకు ఊరికి దూరంగా అడవిలో ఉన్న పాడుబడిన భాగమతి బంగ్లాకు తీసుకెళతారు.

చంచల ఆ బంగ్లాలోకి ప్రవేశించగానే బంగ్లాలోని భాగమతి ఆత్మ ఆమెను ఆవహించి భీభత్సం సృష్టిస్తుంది. ఆ భాగమతి ఎవరు, ఆమె చంచలను ఎందకు ఆవహించింది, అసలు చంచల హత్య ఎందుకు చేసింది, దాని వెనకున్న కారణమేమిటి, భాగమతి కథను ఆమె ఎలాంటి కొలిక్కి తీసుకొస్తుంది అనేదే తెరపై నడిచే కథ.

విజిల్ పోడు :

–> లేడీ సూపర్ స్టార్ అనుష్క ఆరంభం నుండి చివరి వరకు మంచి నటనతో, బాడీ లాంగ్వేజ్ తో సినిమా మొత్తం తానై ముందుకు నడిపారు. కనుక మొదటి విజిల్ ఆమెకే వెయ్యాలి.

–> దర్శకుడు అశోక్ ఫస్టాఫ్, సెకండాఫ్లలలో రూపొందించిన కొన్ని హర్రర్ సీన్స్, థ్రిల్ చేసే ఇంటర్వెల్ బ్లాక్, కొంత ఊహించని క్లైమాక్స్ బాగున్నాయి. కనుక రెండో విజిల్ వేసుకోవచ్చు.

–> ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రూపొందించిన భాగమతి బంగ్లా సెట్ చాలా బాగుంది. భారీగా అనిపించే ఆ సెట్ సినిమా ఆద్యంతం ఒక రకమైన డార్క్ మూడ్ మైంటైన్ అయ్యేలా చేసింది. కనుక మూడో విజిల్ ఆయన పనితనానికే వేయాలి.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> ఫస్టాఫ్, సెకాండాఫ్లలో హార్రర్ సీన్లు, ఇంటర్వెల్, ముగింపు మినహా మిగతా కథనం మొత్తం చాలా బలహీనంగా సాగింది.

–> కథకు ముఖ్యమైన అనుష్క గత జీవితం మొత్తం ఏమాత్రం ఆసక్తికరంగా లేదు. దీంతో సినిమాలో ప్రేక్షకుడిని ఆకట్టుకునే పట్టు లోపించింది.

–> క్లైమాక్స్ ఊహించనిదే అయినా, మలుపుల రీత్యా ఖచ్చితంగానే ఉన్నా ప్రేక్షకుడి అభిమతానికి విరుద్దంగా ఉన్నట్టుండి మారిపోవడం అసంతృప్తి కలిగించే విషయం.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

–> ఈ చిత్రంలో అంతగా ఆశ్చర్యపోవాల్సిన విషయాలేమీ లేవు.
చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ : అనుష్క అదరగొట్టేసింది కదా..
మిస్టర్ బి : అవును.. అన్నీ తానై నడిపింది.
మిస్టర్ ఏ : ఆమెకు తోడుగా కొద్దిగా బలమైన కథనం ఉంటే బాగుండేది.
మిస్టర్ బి : ఎస్.. అప్పుడు సినిమా ఇంకా గొప్పగా వచ్చేది.