టైగ‌ర్ `భాఘి 2` 100కోట్ల క్ల‌బ్‌లో

Monday, April 2nd, 2018, 11:30:39 PM IST

చ‌ర‌ణ్ న‌టించిన `రంగ‌స్థ‌లం` బాక్సాఫీస్ వ‌ద్ద అద్భుత వ‌సూళ్లు సాధిస్తోంది. సేమ్ టు సేమ్ అదే రోజు రిలీజైన టైగ‌ర్ ష్రాఫ్ `భాఘి 2` చ‌క్క‌ని విజ‌యం సాధించింది. ఈ సినిమా తొలి వీకెండ్ నాటికే 100 కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టింది.

`భాఘి 2` తొలి 3రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్ 97కోట్లు వ‌సూలు చేసింది. కేవ‌లం ఇండియాలో ఈ చిత్రం 93 కోట్లు వ‌సూలు చేయ‌డం విశేషం. దేశీయంగా.. డే1 -25.10 కోట్లు, డే2-20.40 కోట్లు, డే3-27.60 కోట్లు (ఆదివారం), ఓవ‌రాల్‌గా మూడు రోజుల‌కు 93.72 కోట్లు వ‌సూలు చేసింది. ఈ వ‌సూళ్ల‌లో 73.10 కోట్లు నెట్ వ‌సూళ్లు సాధించింది. టైగ‌ర్ భాఘి 2 టీజ‌ర్ ద‌శ‌నుంచే సంచ‌ల‌నాలు న‌మోదు చేసింది. అందుకు త‌గ్గ‌ట్టే ప్ర‌పంచ‌వ్యాప్తంగా 4125 స్క్రీన్ల‌లో రిలీజైంది. ఇండియాలోనే 3500 స్క్రీన్ల‌లో , ఓవ‌ర్సీస్‌లో 625 స్క్రీన్ల‌లో రిలీజ్ చేశారు.