“భారతీయుడు 2” తో ఫైట్ చేయనున్న 2 వేల మంది ఫైటర్స్…

Sunday, October 20th, 2019, 01:20:03 AM IST

విశ్వ నటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వస్తున్నటువంటి తాజా చిత్రం ‘భారతీయుడు 2’… కొన్ని సంవత్సరాల క్రితం వచ్చినటువంటి భారతీయుడు చిత్రానికి కొనసాగింపుగా ఈ చిత్రం రానుందన్న సంగతి మనందరికీ తెలిసిందే. కాగా ప్రస్తుతానికి ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌ లో ఒక పెద్ద పోరాట సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు దర్శకుడు శంకర్. అయితే ఈ సన్నివేశాల తరువాత భోపాల్ లో మరొక పోరాట సన్నివేశాలను తెరకెక్కించనున్నారు దర్శకుడు.

అయితే భారీ పోరాట సన్నివేశాలకు ఏకంగా 2 వేల మంది ఫైటర్లతో ఈ సన్నివేశాలను పీటర్ హెయిన్స్ సమక్షంలో తెరకెక్కించనున్నారు. కాగా ఈ చిత్రంలో కమల్ 90 ఏళ్ళ వృద్ధుడి పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, కాజల్‌ అగర్వాల్‌ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.